కూటమి ప్రభుత్వ పథకాలతో ప్రజలకు లబ్ది
పరిశ్రమలు , వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్


కూటమి ప్రభుత్వ పథకాలతో ప్రజలకు లబ్ది
ఒక రోజు ముందుగా పెన్షన్ ల పంపిణి
పరిశ్రమలు , వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్
కర్నూలు ప్రతినిధి జనవరి 31 యువతరం న్యూస్:
కూటమి ప్రభుత్వం కు ప్రజలు ముఖ్యమని ప్రభుత్వ పథకాలను అమలు చేసి ప్రజలకు లబ్ది చేస్తుందని, వాణిజ్యం , పరిశ్రమలు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ సందర్భంగా పేర్కొన్నారు. శనివారం ఉదయం మంత్రి 52వ వార్డు కొండారెడ్డి బురుజు దగ్గర నుండి సాయిబాబా గుడి వరకు ఉన్న 15 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు విచారించి మాల శ్రీనివాసులు , చిన్న ఖాసీం లకు వికలాంగుల పెన్షన్ ను.. మీనాక్షి , నాగమని లకు వితంతు మరియు ఇతరులకు వృద్ధాప్య – ఒంటరి మహిళల పెన్షన్లను పంపిణీ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా పని చేస్తున్నది అన్న విషయాలు మంత్రి వారిని ప్రశ్నించగా వారు మేము ఈ ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నామన్న విషయం తెలియజేశారు. ప్రతినెలా టంచునుగా పెన్షన్ వస్తుందా అని మరియు మొత్తం పెన్షన్ ఇస్తున్నారు కదా అని కూడా అడిగారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ఈ కుటమి ప్రభుత్వం ఒకటో తారీకు సెలవు దినమైనప్పుడు పెన్షన్ ను ఒక రోజు ముందుగానే అందజేస్తుందని , అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వెయ్యి రూపాయల మొత్తాన్ని ఒకటేసారి పెంచి 4000 ఇస్తున్నామని తెలిపారు. వికలాంగులకు రూ 6,000 లు , మంచానికే పరిమితమైన వారికి 15 వేల వరకు పెన్షన్ అందజేస్తున్నామని భారతదేశంలో అత్యధిక సంఖ్యలో పెన్షన్ ఇస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం మాత్రమే అని , ప్రజలకు పథకాలు అన్నిటిని అమలు చేసి మంచి ప్రభుత్వం అన్న ప్రశంశ తెచ్చుకునిందని తెలిపారు.దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని మంత్రి టి.జి. భరత్ ప్రజలకు తెలియజేశారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో జరిగిన వివరాలు తెలుపుతూ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే ఉత్తమంగా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు ఆహ్వానించే కమిట్మెంట్ ను అక్కడ వ్యాపారస్తులకు తెలపడం జరిగిందని మంత్రి తెలియజేశారు. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి కర్నూలు డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.



