ANDHRA PRADESHOFFICIALSPORTS NEWSSTATE NEWS

శ్రీ చైతన్య లో అట్టహాసంగా డాక్టర్ బి.ఎస్.రావు జోనల్ స్పోర్ట్స్ మీట్

శ్రీ చైతన్య లో అట్టహాసంగా డాక్టర్ బి.ఎస్.రావు జోనల్ స్పోర్ట్స్ మీట్

అనంతపురం ప్రతినిధి జనవరి 31 యువతరం న్యూస్:

అనంతపురం నగర శివారులలో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ పామురాయి బ్రాంచ్ లో శనివారం డాక్టర్ బి.ఎస్.రావు జోనల్ స్పోర్ట్స్ మీట్ అట్టహాసంగా జరిగినది. ఈ స్పోర్ట్స్ మీట్ కు ముఖ్య అతిథులుగా విచ్చేసిన అనంతపురం జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వీర్రాజు మరియు అనంతపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ , శ్రీ చైతన్య విద్యాసంస్థల ఉమ్మడి అనంతపురం జిల్లా ఏజీఎం సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. ముఖ్య అతిథులతో కలిసి ఏ జి ఎం సుబ్బారెడ్డి డాక్టర్ బి.ఎస్ రావు పుష్పాంజలి సమర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన గావించి, జాతీయ పతాకమును మరియు క్రీడా పతాకమును ఆవిష్కరించి స్పోర్ట్స్ మీటును ప్రారంభించారు.
అనంతరం అనంతపురం అర్బన్ మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య విద్యాసంస్థల నుండి వచ్చిన విద్యార్థులతో బ్రాంచుల వారీగా మార్చ్ ఫాస్ట్ ను నిర్వహించారు. శాంతికి చిహ్నమైన పావురాలను మరియు బెలూన్లను ముఖ్య అతిథుల చేతులు మీదుగా ఎగురవేశారు. అనంతరం ఏజీఎం శ్రీ సుబ్బారెడ్డి క్రీడలలో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. తదనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏజీఎం సుబ్బారెడ్డి మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అన్ని శ్రీ చైతన్య బ్రాంచుల నుండి దాదాపు 1500 మంది విద్యార్థులు ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్నారు. ఇందులో హై స్కూల్ విద్యార్థులందరికీ కోకో, వాలీబాల్, త్రో బాల్, రన్నింగ్ రేస్ మరియు షార్ట్ పుట్ క్రీడలను, ప్రైమరీ విద్యార్థులకు రిలే గేమ్స్, బాల్ త్రో, రన్నింగ్ రేస్ నిర్వహించారు. ఈ క్రీడలలో విజయం సాధించిన విద్యార్థులకు మెడల్,మరియు సర్టిఫికెట్లు, ట్రోఫీలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వీర్రాజు మాట్లాడుతూ విద్యార్థులు మానసిక పరిపక్వత సాధించడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని అటువంటి క్రీడలు ఆడటానికి తగిన ప్రోత్సాహం అందించడంలో శ్రీ చైతన్య మేనేజ్మెంట్ ఎప్పుడు ముందంజలో ఉంటుందని అభినందించారు. మరొక ముఖ్య అతిథి అనంతపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్  శేఖర్ మాట్లాడుతూ తరగతి గది విద్యార్థులకు జ్ఞానాన్ని అందిస్తే, ఆట స్థలం విద్యార్థులకు తమ భావోద్వేగాలను ఎలా అదుపు చేసుకోవాలో చెబుతుందని అన్నారు. క్రీడలు ఆడటం వలన విద్యార్థులకు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని పెంపొందించుకుంటారని అన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రిన్సిపల్స్, డీన్ లు, కోఆర్డినేటర్లు, రాష్ట్రస్థాయి ఆర్పీలు మరియు ఏఆర్పిలు, పీఈటీలు, ఏవోలు, క్యాంపస్ ఇన్చార్జులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!