ANDHRA PRADESHDEVOTIONALWORLD
శివుడికి అన్నాభిషేకం

శివుడికి అన్నాభిషేకం
కోడుమూరు జనవరి 31 యువతరం న్యూస్:
కోడుమూరు పట్టణంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి శివుడికి అన్నంతో అభిషేకం చేశారు. శుక్రవారం నాడు ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని శివుడి పుట్టినరోజుగా భావిస్తూ శివ స్వాములు మరియు భక్తులు శివుడికి అన్నంతో అభిషేకం చేశారు. మరియు ప్రత్యేక పూజలు చేశారు. ఈ విధంగా శివలింగానికి అన్నంతో అభిషేకం చేయడం వలన మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అనంతరం శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో భక్తులకు, ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున శివ స్వాములు మరియు శివ భక్తులు పాల్గొన్నారు.



