రేపల్లె పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం
రాష్ట్ర మంత్రి అనగాని సత్య ప్రసాద్


రేపల్లె పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం
రాష్ట్ర మంత్రి అనగాని సత్య ప్రసాద్
రేపల్లె జనవరి 24 యువతరం న్యూస్:
రేపల్లె పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి అనగానే సత్యప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలో శనివారం 3, 8, 12, 13, 26 వార్డులలో రూ. 2 కోట్ల నిధులతో నిర్మించిన నూతన సీసీ రోడ్లు, డ్రైన్లు, ఆధునికరీంచిన పార్క్‌ను ప్రారంభించారూ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం రోడ్లు, పారిశుద్ధ్యం వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రేపల్లె ప్రజలకు మెరుగైన రోడ్లు, డ్రైనేజీ, సురక్షిత తాగునీరు, ఆహ్లాదకరమైన పార్క్‌లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా పని చేస్తున్నానని తెలిపారు. రేపల్లె పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా అనగాని హామీ ఇస్తున్నారు. కార్యక్రమంలో ఆర్డిఓ ఎం రామలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ కే సాంబశివరావు, పట్టణ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు మేకా రామకృష్ణ, జనసేన పిఓసి మత్తి భాస్కరరావు, పరిటాల యువసేన నాయకులు పాల్గొన్నారు.



