యువతకు నారా లోకేష్ ఆదర్శం ఏపీ పద్మశాలి సంక్షేమ అభివృద్ది కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల లక్ష్మినరసింహులు

యువతకు నారా లోకేష్ ఆదర్శం
ఏపీ పద్మశాలి సంక్షేమ అభివృద్ది కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల లక్ష్మినరసింహులు
అనంతపురం ప్రతినిధి జనవరి 24 యువతరం న్యూస్:
ఆంధ్ర రాష్ట్ర యువతకు నారా లోకేష్ ఆదర్శమని ఏపీ పద్మశాలి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పోతుల లక్ష్మి నరసింహులు అన్నారు. శుక్రవారం స్థానిక క్లాక్ టవర్ వద్ద చేనేత జౌలి శాఖ కార్యాలయం ఎదుట మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు చేనేతలు,కార్మికులు,విద్యార్థులు అట్టహాసంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పోతుల లక్ష్మినరసింహులు మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల పట్ల చిత్తశుద్ధితో నారా లోకేష్ జన్మదిన సందర్భంగా రెండు లక్షల ఇళ్ల పట్టాలను నేడు మంజూరు చేయడం అభినందనీయమని అన్నారు. తెలుగుదేశం పార్టీలో బడుగు, బలహీన వర్గాల వారికి చోటు కల్పించేందుకు సంస్కరణలు చేయడంలో నారా లోకేష్ పాత్ర అమోఘమని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త తమ కుటుంబ సభ్యులుగా భావించి ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల బీమాను కల్పించడం ద్వారా కార్యకర్త కుటుంబాలకు పెద్దన్న లాగా నిలిచారన్నారు. టీడీపీ పార్టీలో బీసీలకు పెద్దపీట వేసేందుకు నాయకత్వాన్ని పెంచేందుకు సాధికార కమిటీలను ఏర్పాటు చేసి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులను దక్కేలాగా చేయడంతో కృతజ్ఞతలు తెలిపారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వంలో నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న వ్యక్తి నారా లోకేష్ అని అన్నారు. రాష్ట్రంలో అసాంఘిక,ఆర్థిక ఉగ్రవాదం,గంజాయి,కల్తీ మద్యం,దందాల అరికట్టేందుకు రెడ్ బుక్ సృష్టికర్త నారా లోకేష్ అన్నారు.చేనేతల అభివృద్ది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అన్నారు.నేతన్నలకు ఉచిత విద్యుత్తు అభినందనీయం అని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాయల్ మధు,జోగి రాజేంద్ర,చేనేత కులాల ఐక్య వేదిక అధ్యక్షుడు మహదేవ ప్రసాద్,బండి శ్రీనివాసులు,కార్మికుల సంఘం నాయకులు పోతుల రాజేశ్వరి,మంజునాథ్,పద్మశాలి సంఘం నేతలు పుత్తా ఎర్రిస్వామి,దేవరకొండ నరసింహులు,జానపాటి సత్యనారాయణ,దేవిరెడ్డి రాము,జక్కా వెంకటరామయ్య,సలీం,కిరణ్ కుమార్,ఆసిఫ్,ఇనాయతుల్లా,రఫీ,యమహా భాషా,హరి తదితరులు పాల్గొన్నారు.



