ANDHRA PRADESHEDUCATIONWORLD
వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన మూడవ తరగతి విద్యార్థిని


వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన మూడవ తరగతి విద్యార్థిని
నంద్యాల ప్రతినిధి జనవరి 20 యువతరం న్యూస్:
నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కు చెందిన మూడవ తరగతి విద్యార్థిని కె. నాగసారిక (తండ్రి : కె. సుబ్బారాయుడు) వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించి పాఠశాలకు, జిల్లాకు గర్వకారణంగా నిలిచిందని జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి తెలిపారు. మంగళవారం కలెక్టర్ చాంబర్ లో కె. నాగసారిక విద్యార్థినిని ఘనంగా సత్కరించి అభినందించారు. కేవలం 28 సెకన్లలో 100 హిందీ పదాలను అత్యంత వేగంగా ఉచ్చరించి ఈ ప్రతిష్టాత్మక రికార్డును సాధించిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ విజయం నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యా ప్రమాణాలకు నిదర్శనమని తెలిపారు.



