క్రీడలను,క్రీడాకారులను ప్రోత్సహిస్తాం
రాజ్యసభ మాజీ సభ్యుడు టిజీ వెంకటేష్

క్రీడలను,క్రీడాకారులను ప్రోత్సహిస్తాం
రాజ్యసభ మాజీ సభ్యుడు టిజీ వెంకటేష్
కర్నూలు ప్రతినిధి జనవరి 16 యువతరం న్యూస్:
ప్రతిభగల క్రీడాకారులను, క్రీడలను ప్రోత్సహించడమే టిజీవి సంస్థల లక్ష్యమని రాజ్యసభ మాజీ సభ్యుడు టిజీ వెంకటేష్ అన్నారు. ఇటీవల ఆత్రేయపురంలో జరిగిన జాతీయస్థాయి డ్రాగన్ బోట్ పోటీల్లో టిజి వెంకటేష్ కర్నూలు బోటింగ్ క్లబ్ జట్టు పాల్గొని రెండవ స్థానం సాధించడంతో, శుక్రవారం నగరంలోని తన కార్యాలయంలో ఆయన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్న సమయంలో నగరవనం చెరువు అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. టీజీవి డ్రాగన్ బోట్ క్లబ్ క్రీడాకారులు మంచి ప్రతిభ చూపి జాతీయస్థాయిలో రాణించడం శుభ పరిణామం అన్నారు. జట్టు సభ్యులందరికీ స్పోర్ట్స్ కిట్లను,బహుమతులను టీజీవి సంస్థల నుండి అందిస్తానని ప్రకటించారు. చెడు వ్యసనాల బారిన పడకుండా క్రమశిక్షణతో అంకితభావంతో సాధన చేసి క్రీడా రంగంలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ వాటర్ స్పోర్ట్స్ శిక్షకుడు చంద్రశేఖర్, రాష్ట్ర డ్రాగన్ బోట్ అసోసియేషన్ కార్యదర్శి అవినాష్ శెట్టి, ఉపాధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.



