ముస్తాబు అయినా శ్రీ తాండవ మల్లేశ్వర స్వామి వారి ఆలయం


ముస్తాబు అయినా శ్రీ తాండవ మల్లేశ్వర స్వామి వారి ఆలయం
14 నుంచి శ్రీ తాండవ మల్లేశ్వరస్వామి వారి తిరునాల
కొత్తపల్లి జనవరి 13 యువతరం న్యూస్:
మండల కేంద్రమైన కొత్తపల్లెలో ఈనెల 14 నుంచి 16వ తేది వరకు జరిగే శ్రీ తాండవ మల్లేశ్వరస్వామి వారి తిరునాల కోసం శ్రీ తాండవ మల్లేశ్వరస్వామి ఆలయం ముస్తాబవుతుంది. ఈనెల 14న శ్రీ తాండవ మల్లేశ్వరస్వామిని పెళ్లికుమారునిగా ముస్తాబు కార్యక్రమాలు రాత్రి శ్రీ తాండవ మల్లేశ్వరస్వామి పార్వతిదేవి ఉత్సవమూర్తులకు కళ్యాణ మహోత్స వం, 15న ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం, ప్రభోత్సవం, 16న పార్వేట కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. పురాణకాల ప్రకారం హరివరం తులసీపురం, చింతలపల్లె,పాడు, సోమేశ్వరం అనే ఈ అయిదు గ్రామాల కలయికే కొత్తపల్లి గ్రామం కొత్తపల్లెలో అయా గ్రామాల్లో గత్తర (కలర) రావడంతో వందల సంఖ్యలో మరణించడంతో మిగిలినవారంతా ఒక కొత్త ప్రదేశానికిచేరుకొని కొత్తగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఈప్రదేశానికి కొత్తపల్లె అని నామకరణం చేశారు. అప్పటినుండి గ్రామస్తులంతా ఏటా జనవరి మాసంలో సంక్రాంతి పర్వదినం ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీ తాండవ మల్లేశ్వరస్వామి తిరునాల నిర్వహి స్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. కొత్తపల్లెలో వెలసిన శ్రీ తాండవ మల్లేశ్వరస్వామి ఆలయం అతిపురాతన మైంది. ఇక్కడ శివుడు తాండవం చేయడం వల్ల శ్రీ తాండవ మల్లేశ్వరస్వామి ఆలయంగా పేరు వచ్చినట్లు ఇక్కడి ప్రజల నమ్మకం. అందుకే ఈస్వామిని దర్శించుకుంటే శ్రీశైల మల్లిఖార్జునను దర్శించు కున్న పుణ్యఫలమని భక్తుల నమ్మకం ఈ ఆలయాన్ని వందల ఏళ్ళక్రితం జనమే జయరాజు నిర్మించినట్లు అప్పటి నుంచి అచారంగావస్తున్న తిరునాల నాలుగు రోజులు జరుపుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు.



