ANDHRA PRADESHDEVOTIONALOFFICIALWORLD

ఆరాధ్యుడు, దయామయుడు, కరుణామయుడు ఏసుక్రీస్తు

క్రీస్తు విలువలను ముందుకు తీసుకుపోవాలి

ఆరాధ్యుడు, దయామయుడు, కరుణామయుడు ఏసుక్రీస్తు

క్రీస్తు విలువలను ముందుకు తీసుకుపోవాలి

ఘనంగా “క్రిస్మస్ హై-టీ “ కార్యక్రమం

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల ప్రతినిధి డిసెంబర్ 21 యువతరం న్యూస్:

ఆరాధ్యుడు, దయామయుడు, కరుణామయుడు, ఏసుక్రీస్తు అని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు.

శనివారం సాయంత్రం నంద్యాల పట్టణంలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మైనార్టీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్-2025 హైటి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ…
సుమారు రెండువేల ఏళ్ల క్రితం రోమ్ సామ్రాజ్యంలో జన్మించిన ఏసుక్రీస్తు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి ఆరాధ్యుడు, దయామయుడు, కరుణామయుడుగా క్రైస్తవులతో ఆరాధనలు అందుకుంటున్నారన్నారు.
క్రిస్మస్ పండుగ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు డిసెంబర్ 24, 25వ తేదీలలో అత్యంత ఘనంగా జరుపుకుంటారన్నారు.
ప్రభుత్వం క్రిస్మస్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రభుత్వం తరఫున సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు.
క్రీస్తు విలువలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని క్రిస్మస్ అంటే శాంతికి చిహ్నం రాష్ట్ర ప్రజలందరూ శాంతియుతంగా, సుఖ సంతోషాలతో క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నానన్నారు.

అనంతరం జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ మాట్లాడుతూ…. కరుణ,
దయ, దాతృత్వం కలిగిన ఏసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి దారి చూపుతాయన్నారు. యేసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగ రోజును ప్రజలంతా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
క్రిస్మస్ హైటీ కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, కేక్ కట్ చేసి క్యాండిల్ వెలిగించి క్రైస్తవ సోదరులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాము నాయక్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి, మున్సిపల్ కమిషనర్, మెప్మా పీడీ, పాస్టర్లు, క్రిస్టియన్ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!