కర్నూలు జిల్లా పోలీసులకు ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి ఎబిసిడి అవార్డు
రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా అవార్డు అందుకున్న కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ ఐపియస్ , జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్


కర్నూలు జిల్లా పోలీసులకు ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి ఎబిసిడి అవార్డు
“అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ (ఏబీసీడీ)” అవార్డ్ సాధించిన కర్నూలు జిల్లా పోలీసులు
రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా అవార్డు అందుకున్న
కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ ఐపియస్ , జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
కర్నూలు ప్రతినిధి డిసెంబర్ 20 యువతరం న్యూస్:
రాష్ట్ర వ్యాప్తంగా కీలక కేసుల దర్యాప్తుల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరచడాన్ని గుర్తించి ప్రతిష్టాత్మకంగా ప్రతీ 3నెలలకు ఒకసారి ప్రకటించే “అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ (ఏబీసీడీ)” అవార్డ్ మొదటి క్వార్టర్ (జనవరి -మార్చి )2025 గాను ఉలిందకొండ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎటిఎం దొంగతనం కేసును చేధించినందుకు గాను కర్నూలు జిల్లా పోలీసు విభాగం ఎంపిక అయింది.
డి.జి.పి ప్రధాన పోలీస్ కార్యాలయం మంగళగిరిలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఐ.పీ.ఎస్., చేతుల మీదుగా కర్నూలు పోలీసులు ఎబిసిడి అవార్డు స్వీకరించారు. జిల్లాలో జరిగిన ఎటిఎం దొంగతనం కేసును చేధించి చురుగ్గా వ్యవహారించిన పోలీసు అధికారులను అభినందించారు. అవార్డులు పొందిన వారిలో కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ ఐపియస్ , కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్, కర్నూలు రూరల్ సిఐ చంద్రబాబునాయుడు, ఉలిందకొండ ఎస్సై ధనుంజయ, ఓర్వకల్లు ఎస్సై సునీల్ మరియు సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ ఐపియస్ , కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ మాట్లాడుతూ…
కర్నూలు జిల్లాకు ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ దక్కేందుకు సదరు కేసును చేదించడంలో కృషి చేసిన అధికారులను మరియు సిబ్బందిని కర్నూలు రేంజ్ డిఐజి, కర్నూలు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ అవార్డును స్ఫూర్తి గా తీసుకొని, జిల్లా వ్యాప్తంగా నమోదైన మరిన్ని కేసులను సమర్థవంతంగా చేదించేందుకు మరింత కృషి చేయాలని, జిల్లాకు మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
జరిగినవిషయం..
కర్నూలు ఉలిందకొండ పోలీసుస్టేషన్ పరిధిలో ఏటీఎం మిషన్ల ను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన నలుగురు నిందితులను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు.
కర్నూలు పరిధిలో ఫిబ్రవరి 23,24 తేదీల్లో రెండు ఏటీఎం కేంద్రాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఉలిందకొండ పోలీసు స్టేషన్ పరిధిలోని చిన్న టేకూర్ గ్రామంలో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు ఏటీయంను దొంగలు పెకలించి వాహనంలో తీసుకుని పోతుండగా స్థానిక యువకులు అనుమానించి వెంటబడ్డారు. దీంతో దొంగలు వాహనాన్ని వదలి పరారయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. పట్టుబడిన నలుగురు షాహీద్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, జంసాద్ ఖాన్, షావ్కర్ ఖాన్ వీరు లారీ డ్రైవర్లు గా పనిచేస్తు ఏటీయం మిషన్లను దొంగలించే ముఠాగా ఏర్పడ్డారని వివరించారు.
షాహిద్ ఖాన్ ముఖ్య నేరస్థుడిగా గుర్తించారు.
ఇతనిపై వివిధ రాష్ట్రాల్లో 26 ఏటీఎం దొంగతనాల కేసులు, మరో నిందితుడు ఇమ్రాన్ ఖాన్ పై 15 ఏటీఎం దొంగతనాల కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు.
ఏటీఎం దొంగతనం కోసం ఉపయోగించే సామాగ్రిని వారి నుంచి స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్ కు తరలించారు.



