ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ చేతులమీదుగా జల జీవన్ మిషన్ కింద పత్తికొండకు తాగునీరు ప్రారంభం

ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ చేతులమీదుగా జల జీవన్ మిషన్ కింద పత్తికొండకు తాగునీరు ప్రారంభం
పత్తికొండ ప్రతినిధి డిసెంబర్ 20 యువతరం న్యూస్:
గతంలో పత్తికొండ పట్టణం త్రాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులను చూసి నేడు పత్తికొండ ప్రజల తాగునీటి ఇబ్బంది కలగకుండా రోజు మార్చి రోజు ప్రతి ఇంటికి త్రాగునీరు వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం కొత్తపల్లి రిజర్వాయర్ నుండి రూ.3 కోట్లతో జలజీవన్ మిషన్ కింద పత్తికొండ పట్టణానికి త్రాగునీరు పథకాన్ని ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు.
పత్తికొండ మండలం కొత్తపల్లి రిజర్వాయర్ దగ్గర నుండి పైప్లైన్ ద్వారా పత్తికొండ పట్టణానికి తాగునీటి నివారణ కోసం 3 కోట్ల రూపాయలతో తాగునీటి పథకాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ మాట్లాడుతూ పత్తికొండ పట్టణ ప్రజలు ఇబ్బందులు పడకుండా త్రాగునీటి సౌకర్యం కల్పించింది కూటమి ప్రభుత్వం అని తెలియజేశారు. గతంలో 2014 లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కొత్తపల్లి దగ్గర ఫిల్టర్ బెడ్లు ను ఏర్పాటు చేసింది.కానీ వాటిని గత ప్రభుత్వం వాటిని మార్చకుండా కనీసం ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని సర్వీస్ కూడా చేయించకుండా అలాగే నీటిని కొలయాలకుల వదిలారు, దానివలన ప్రజలు అనారోగ్యాలకు గురి కావడం జరిగింది అన్నారు. అలాగే ఎన్నో ఏళ్ల నుండి ఆయకట్టుని వదిలేసిన రైతులు నేడు ఆయకట్టలను సాగు చేసుకుంటున్నారు. దీనికి కూటమి ప్రభుత్వం చెరువులను నింపడంతో గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లు ద్వారా మరియు చెరువు ఆయకట్టల ద్వారా రైతులు పంటలను సాగు చేసుకుంటున్నారని అందుకు కూటమి ప్రభుత్వం కృషి అని అన్నారు. అలాగే పత్తికొండ ప్రజలకు త్వరలో కుటుంబంతో ఆహ్లాదకరంగా గడిపేందుకు పార్కులు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమ్ము దీపిక,కూటమి నాయకులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



