ANDHRA PRADESHDEVELOPOFFICIAL

బొందిమడుగుల గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కె.ఈ. శ్యాం కుమార్

బొందిమడుగుల గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కె.ఈ. శ్యాం కుమార్

తుగ్గలి డిసెంబర్ 18 యువతరం న్యూస్:

గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయమని ఎమ్మెల్యే కెఈ శ్యామ్ కుమార్ అన్నారు.బుధవారం మండలం పరిధిలోని బొందిమడుగుల గ్రామంలో ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ బ్రిడ్జిని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్ మాట్లాడుతూ గత ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచు చౌడప్ప, సర్పంచ్ గౌరవ సలహాదారు ప్రతాప్ యాదవ్, సొసైటీ చైర్మన్ వై వి ప్రభాకర్ రెడ్డి, టిడిపి మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు, టిడిపి మండల ఉపాధ్యక్షులు, వెంకట్ రాముడు చౌదరి, సొసైటీ డైరెక్టర్ మోహన్, కాంట్రాక్టర్ దశరథ రామిరెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన టిడిపి నాయకులు, టిడిపి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!