ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ సామగ్రి పంపిణీ

ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ సామగ్రి పంపిణీ
ఉత్తరాంధ్ర ప్రతినిధి డిసెంబర్ 18 యువతరం న్యూస్:
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లో భాగంగా గురువారం 50వ వార్డు పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ స్టవ్, నిండు సిలిండర్, రెగ్యులేటర్, పైపు, బాండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 50వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సలపల వరప్రసాద్ (బీటెక్) లబ్ధిదారులకు స్వయంగా సామగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా డీవీఆర్ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ అధినేత ఆర్. దేవుడు బాబు మాట్లాడుతూ, ఉజ్వల యోజన పథకం ద్వారా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ సహా అవసరమైన సామగ్రి అందించబడుతుందని తెలిపారు.
గ్యాస్ సామగ్రిని పొందిన లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఈ పథకం తమ కుటుంబ జీవితాల్లో పెద్ద మార్పు తీసుకొస్తుందని పేర్కొన్నారు. మహిళల ముఖాలలో ప్రత్యేకమైన సంతోషం కనిపించగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో 50వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పెంటకోట శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు నంబాల నాగరాజు, చంద్రశేఖర్ రాజు, అలాగే జనసేన పార్టీ 50వ వార్డు అధ్యక్షులు సనపల సాగర్, జనసేన నాయకులు రవి కిరణ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



