
సీఎం చంద్రబాబుకు అవార్డు రావడం ఏపీకి గర్వకారణం
మంత్రి టీజీ భరత్
కర్నూలు ప్రతినిధి డిసెంబర్ 18 యువతరం న్యూస్:
సీఎం నారా చంద్రబాబు నాయుడుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. సీఎంకు అవార్డు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘దార్శనికత విశ్వాసాన్ని సృష్టిస్తుంది, విశ్వాసం పెట్టుబడులను ఆకర్షిస్తుంది, పెట్టుబడి ఉద్యోగాలను సృష్టిస్తుంది’ అని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ఇది గర్వకారణమైన క్షణం అన్నారు. సీఎం చంద్రబాబు బలమైన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తుందన్నారు.



