క్రీడల అభివృద్ధికి కృషి చేస్తాం
ఎపిఐఐసి డైరెక్టర్ జగదీష్ గుప్తా

క్రీడల అభివృద్ధికి కృషి చేస్తాం
ఎపిఐఐసి డైరెక్టర్ జగదీష్ గుప్తా
కర్నూలు ప్రతినిధి డిసెంబర్ 16 యువతరం న్యూస్:
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి పట్ల ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని ఎపిఐఐసి డైరెక్టర్ దోమా జగదీష్ గుప్తా అన్నారు. స్థానిక సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో కర్నూలు జిల్లా నెట్ బాల్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా నెట్ బాల్ సీనియర్ క్రీడాకారుల ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా క్రీడాకారులనుద్దేశించి జగదీష్ గుప్తా మాట్లాడుతూ కర్నూలు నగరాన్ని స్పోర్ట్స్ సిటీగా మార్చడానికి పరిశ్రమల శాఖా మంత్రి టీజీ భరత్ పట్టుదలతో కృషి చేస్తున్నారని అన్నారు. కర్నూలులో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి టీజీ భరత్ ఒక ప్రణాళికతో ముందుకెళుతున్నారని ఆయన అన్నారు. జిల్లా నెట్ బాల్ క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో విజేతలై తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు. కష్టపడే క్రీడాకారులకు వ్యక్తిగతంగా తన వంతు చేయూతనందిస్తానని జగదీష్ గుప్తా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపిక పోటీల్లో గెలుపొందిన విజేతలకు మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నెట్ బాల్ సంఘం అధ్యక్షుడు నాగేశ్వర బాబు, ఉపాధ్యక్షుడు ఆనందరావు, కార్యదర్శి వంశీకృష్ణ, సంఘం సీఇవో నాగరత్నమయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు రాజశేఖర్, విజయకుమార్, జగన్, వెంకటలక్ష్మి, చంద్రకళ, మార్కెట్ యార్డు డైరెక్టర్ శ్రీధర్, రిటైర్డ్ డియస్పీ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.



