ANDHRA PRADESHCRIME NEWSOFFICIAL
యువకుడి అదృశ్యం కేసును ఛేదించిన పోలీసులు
గ్రామీణ సీఐ సురేష్ కుమార్ రెడ్డి,ఎస్ఐ జయశేఖర్

యువకుడి అదృశ్యం కేసును ఛేదించిన పోలీసులు
గ్రామీణ సీఐ సురేష్ కుమార్ రెడ్డి,ఎస్ఐ జయశేఖర్
కొత్తపల్లి డిసెంబర్ 14 యువతరం న్యూస్:
కొత్తపల్లి మండల పరిధిలోని గువ్వలకుంట్ల గ్రామంలో 2021లో యువకుడి అదృశ్యం కేసును పోలీస్ లు ఛేదించారు. ఆదివారం సాయంత్రం ఆత్మకూరు గ్రామీణ సీఐ సురేశ్ కుమార్ రెడ్డి, కొత్తపల్లి ఎస్సై జయశేఖర్ ఆధ్వర్యంలో ఆ యువకున్ని తల్లికి అప్పగించారు. పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం గువ్వలకుంట్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే యువకుడు అప్పుల పాలై, హైదరాబాద్ వెళ్లి ఏదైన ఉద్యోగం చేసి అప్పులు తీర్చుతానని ఇంట్లో నుంచి 2021 నవంబర్ 21న వెళ్లాడు. ఆరోజు నుంచి . తమ కుమారుడి ఆచూకీ లేదని తల్లి రవణమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తూ చేపట్టారు. ఆ యువకుని ఆచూకీ హైదరబాద్ పట్టణం లో గుర్తించి, పోలీస్ లు క్షేమంగా తల్లి వద్దకు చేర్చారు.



