ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ డీకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి


ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ డీకొని
ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
అమడగూరు డిసెంబర్ 14 యువతరం న్యూస్:
అమడగూరు మండల పరిధిలోని స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో ఆదివారం ట్రాక్టర్.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు హరికృష్ణ (36) మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మృతుడు హరికృష్ణ ముదిగుబ్బ పట్టణానికి చెందిన వాసి,ఇతను మండలంలోని జవకలు కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నారు.ఆదివారం కర్ణాటకలోని బాగేపల్లికి తన సొంత పనిమీద వెళ్లి తిరిగి ద్విచక్రవాహంలో ఓబులదేవరచెరువు కు వెళ్తుండగా మహమ్మదాబాద్ నుంచి అమడగూరు కు వస్తున్న ఇసుక ట్రాక్టర్,ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఉపాధ్యాయుడు హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై సుమతి సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని చికిత్స కోసం అమడగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు.ఈ విషయం పై ఎస్సై సుమతి ప్రమాదంపై ఆరా తీసి కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆమె తెలిపారు.మృతునికి భార్య,ఇద్దరు కుమారులు ఉన్నారు.



