జనవరి 9 నుండి 12 వరకు బిహెచ్.పివి గ్రౌండ్స్ లో క్రికెట్ పోటీలు
లోగోను ఆవిష్కరించిన బిజేపి రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కేఎన్ఆర్

జనవరి 9 నుండి 12 వరకు బిహెచ్.పివి గ్రౌండ్స్ లో క్రికెట్ పోటీలు
లోగోను ఆవిష్కరించిన బిజేపి రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కేఎన్ఆర్
ఉత్తరాంధ్ర ప్రతినిధి డిసెంబర్ 14 యువతరం న్యూస్
గాజువాక పాతకర్నవాని పాలెం బిజేపి రాష్ట్ర మీడియా పేనలిస్ట్ గాజువాక ఇంచార్జ్ కరణంరెడ్డి నరసింగరావు క్యాంపు కార్యాలయంలో బిహెచ్.పివి మాజీ ఉద్యోగుల సంఘం సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసారు.జనవరి 9 నుండి12 వరకు బిహెచ్.పివి గ్రౌండ్స్ లో జరగబోయే క్రికెట్ పోటీల లోగోను కేఎన్ఆర్ చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు 2026 సందర్భంగా మాజీ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి పది టీంలుగా ఏర్పడి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని తెలిపారు. బిగ్ బాస్ రెండో సీజన్ విజేత కౌశల్ మండా, భారత క్రికెటర్ నితీష్ రెడ్డి,వంటి పలువురు ప్రముఖులు కూడా వస్తారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ బుల్లి తెర డి20 డ్యాన్సర్ జాన్షి, కొరియోగ్రాఫర్ రమేష్ మాస్టర్ , కమిటీ సభ్యులు శివ,రాము,అప్పారావు,శ్రీనివాస్, నాయుడు తదితరులు పాల్గొన్నారు.



