కర్నూల్: వంక ,వాగు, డొంక, రోడ్డు లలో అక్రమ ఇళ్ల నిర్మాణాలు
ఏసీబీ అధికారులు వెల్దుర్తి తహసిల్దార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తే.

వంక ,వాగు, డొంక, రోడ్డు లలో అక్రమ ఇళ్ల నిర్మాణాలు
చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
అధికారుల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు
ఏసీబీ అధికారులు వెల్దుర్తి తహసిల్దార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తే……
వెల్దుర్తి నవంబర్ 28 యువతరం న్యూస్:
ఒక ఇంటికి విద్యుత్ కనెక్షన్ కావాలంటే ఇంటి పన్ను కావాలి. ఇంటి పన్ను కావాలంటే ఆ ఇంటికి ఇంటి పట్టా ఉండాలి. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి వంక ,వాగు, డొంక, రోడ్డులలో అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ ఎలా వచ్చింది. మండల కేంద్రమైన వెల్దుర్తి లో అక్రమంగా ప్రభుత్వ స్థలాలలో నిర్మించుకున్న ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ లు రావడం పట్ల మండల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా నిర్మించుకున్న ఇల్లు అధికారులకు ఆగుపడడం లేదా అంటూ మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మండల కేంద్రమైన వెల్దుర్తిలో అక్రమ ఇళ్ల నిర్మాణాలు చేపడితే అధికారులు చూసీచూడనట్టు ఉండడం పట్ల మండల ప్రజలు అధికారుల తీరు పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని అక్రమ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కొద్దిమంది సంబంధిత అధికారులు ఆ ఇళ్లకు ఇంటి పట్టాలు ఇచ్చి ఉన్నారేమో అని మండల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి పట్టాలు లేకపోతే ఇంటి పన్ను, విద్యుత్ కనెక్షన్ ఎలా వస్తుందని అనుమానం. ప్రభుత్వ స్థలాలలో నిర్మించిన ఇళ్ల పై తగు చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకంజ వేయడం పట్ల మండల ప్రజలు పలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఏసీబీ అధికారులు వెల్దుర్తి తహసిల్దార్ కార్యాలయంలో తనిఖీలు చేపడితే అవినీతి బాగోతం వెలుగులోనికి వస్తుందని మండల ప్రజలు తెలుపుతున్నారు.



