గతంలో స్టేట్ హెడ్ క్వార్టర్స్ లో అక్రిడిటేషన్ కలిగిన పత్రికలకు ఎంప్యానెల్మెంట్ తో సంబంధం అక్రిడేషన్లు మంజూరు చేయాలి
ఆంధ్రప్రదేశ్ సమాచార & ప్రజా సంబంధాల శాఖ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ కి వినతి పత్రం అందజేసిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA)

గతంలో స్టేట్ హెడ్ క్వార్టర్స్ లో అక్రిడిటేషన్ కలిగిన పత్రికలకు ఎంప్యానెల్మెంట్ తో సంబంధం అక్రిడేషన్లు మంజూరు చేయాలి
ఆంధ్రప్రదేశ్ సమాచార & ప్రజా సంబంధాల శాఖ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ కి వినతి పత్రం అందజేసిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA)
అమరావతి ప్రతినిధి నవంబర్ 29 యువతరం న్యూస్:
గతంలో స్టేట్ హెడ్‌క్వార్టర్స్ అక్రిడిటేషన్ కలిగిన చిన్న పత్రికలకు ఎంపానెల్‌మెంట్ నిబంధన అడ్డంకిగా మారిన అంశంపై పునఃపరిశీలన చేసి, గత అనుభవం పరిగణలోకి తీసుకుని అక్రిడిటేషన్లు మంజూరు చేయడానికి మార్గదర్శకాలు జారీ చేయవలసిందిగా – నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) తరపున ఆంధ్రప్రదేశ్ సమాచార & ప్రజా సంబంధాల శాఖ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ కి
వినతి పత్రం అందజేశారు..
రాష్ట్ర సమాచార శాఖ పరిధిలో మీడియా అక్రిడిటేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించేందుకు ప్రభుత్వం చేస్తున్న చర్యలను మా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) హృదయపూర్వకంగా అభినందిస్తున్నది. “నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA)” తరఫున ఈ వినతిపత్రం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల అక్రిడిటేషన్ విధానంలో చోటు చేసుకుంటున్న మార్పులు, ముఖ్యంగా ఎంపానెల్‌మెంట్ లేకపోతే అక్రిడేషన్ ఇవ్వలేమని ఐ&పీఆర్ శాఖ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల చిన్న పత్రికలు మరియు వేలాది జర్నలిస్టులు పడుతున్న తీవ్ర ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సమస్య కేవలం ఒక వృత్తి సమస్య కాదు. ఇది ప్రజాస్వామ్యానికి శ్వాస లాంటి మీడియా రంగం బలహీనపడే ప్రమాదానికి సంకేతం. అయితే, ఇటీవల అమల్లోకి వచ్చిన ఎంపానెల్‌మెంట్ విధానాలు గతంలో స్టేట్ హెడ్‌క్వార్టర్స్ అక్రిడిటేషన్ కలిగి ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా కవర్ చేసిన అనేక చిన్న పత్రికలకు అనుకోని అడ్డంకిగా మారిన విషయం కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు..
దేశంలో మీడియా పరిసరాలు మారుతున్న సందర్భంలో చిన్న పత్రికలు, పట్టణ/జిల్లా స్థాయి వార్తాపత్రికలు, స్థిరంగా పనిచేస్తున్న వార,పక్ష,మాస పత్రికలు కూడా ప్రభుత్వ సమాచార ప్రసారంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. గతంలో ఏళ్ల తరబడి స్టేట్ స్థాయి అక్రిడిటేషన్‌ను అనుభవంతో, నిబద్ధతతో పొందిన వారు ప్రస్తుతం ఎంపానెల్‌మెంట్ నిబంధనల కారణంగా అక్రిడిటేషన్‌కు దూరమవడం వలన పత్రికల పనితీరుకు ప్రతికూల ప్రభావం ఏర్పడుతోందనీ కమిషనర్ కు తెలియజేశారు..
ప్రభుత్వ ప్రకటనలకు ఎంపానెల్‌మెంట్ అవసరం నిజమే. కానీ— ఏ జీవోలోనూ, ఏ కేంద్ర మార్గదర్శకాలలోనూ “ఎంపానెల్ లేకుంటే అక్రిడేషన్ ఇవ్వలేదు” అనే నిబంధన లేదు. ఇది పూర్తిగా కొత్తగా అధికారులు సృష్టించిన నియమం. గతంలో ఎప్పుడూ లేని, చట్టపరమైన ఆధారం లేని తక్కువ సర్కులేషన్ కలిగిన చిన్న పత్రికలు, అమాయక జర్నలిస్టులపై భారంగా మారిన అన్యాయమని తెలియజేశారు.
ఈ సందర్భంగా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) తరపున కమిషనర్ కు పలు డిమాండ్లపై వినతిపత్రం అందజేశారు. గతంలో స్టేట్ హెడ్‌క్వార్టర్స్ అక్రిడిటేషన్ కలిగిన చిన్న పత్రికలను ప్రత్యేక శ్రద్ధతో పునఃపరిశీలించడానికి ప్రత్యేక సూచనలు ఇవ్వవలసిందిగా కోరారు. ఎంపానెల్‌మెంట్ నిబంధనలను పత్రికల సుదీర్ఘ అనుభవం, విశ్వసనీయత, గత వార్తా కథనాలు ఆధారంగా సవరించి అమలు చేయవలసిందిగా కోరారు. చిన్న పత్రికలు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారంలో కొనసాగడానికి అవసరమైన స్టేట్ అక్రిడిటేషన్ మంజూరు చేసేందుకు అనుకూల మార్గదర్శకాలు జారీ చేయవలసిందిగా కోరారు. ఎంపానెల్‌మెంట్‌ను అక్రిడేషన్ షరతుగా వెంటనే తొలగించాలనీ డిమాండ్ చేశారు. గతంలో స్టేట్ హెడ్ క్వార్టర్స్లో అక్రిడేషన్ కలిగిన పత్రికలకు పబ్లికేషన్ సెంటర్ తో సంబంధం లేకుండా సర్కులేషన్ ఆధారంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కనీసం జిల్లాకు రెండు అక్రిడేషన్లు చొప్పున మంజూరు చేయాలనీ కోరారు..
ఈ కార్యక్రమంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు, క్యాపిటల్ వాయిస్ ఎడిటర్ పి. బుచ్చిబాబు, ప్రజాకాంక్ష ఎడిటర్ కృష్ణ, రాజధాని వాయిస్ ఎడిటర్ పూర్ణచంద్రరావు, ఈపీపీ కుమార్, ఆంధ్ర రేఖ ఎడిటర్ వసంత్, అక్షర భూమి ఎడిటర్ బిల్లా రాజు, “విజయ సారథి” న్యూస్ ఎడిటర్ సిరివెళ్ల నాగరాజు పాల్గొన్నారు.



