సూర్యుని లాగా జర్నలిస్టులు వెలుగునిస్తారు
సమాజానికి ఉపయోగపడేది జర్నలిస్టులే


సూర్యుని లాగా జర్నలిస్టులు వెలుగునిస్తారు
సమాజానికి ఉపయోగపడేది జర్నలిస్టులే
ఆరోగ్యమే మహాభాగ్యం
కర్నూలు ప్రతినిధి నవంబర్ 27 యువతరం న్యూస్:
సమాజం కి హాని కలిగించే వారిని ధైర్యంగా ఎదిరించాలని సమాజం కి హాని కలిగించే వారిని జర్నలిస్టులు ధైర్యంగా ఎదిరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంజనీరింగ్ కళాశాలల రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.వి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల అధినేత కెవి సుబ్బారెడ్డి తెలిపారు.
ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం రెవెన్యూ భవనంలో సీనియర్ జర్నలిస్టు లు మనోహర్, మీసాల రామస్వామి, వలి రంగా, జాకీర్ ల ఆధ్వర్యంలో జర్నలిస్టు కుటుంబ సభ్యుల ఉచిత వైద్య శిబిరాన్ని మెడికవర్ హాస్పిటల్, సహకారంతో నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధినేత కెవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ సమాజానికి హాని కలిగించే వారిని ఎదిరించే బాధ్యత జర్నలిస్టు ల దే నని, సమాజానికి సూర్యుని లాగా వెలుగు నిచ్చేది జర్నలిస్టులేనన్నారు. జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టుల హెల్త్ కార్డ్స్ ప్రైవేటు హాస్పిటల్లో వర్తింప చేయాలని, రైల్వే పాసులు సక్రమంగా అమలు చేయాలని, అక్రి డి టేషన్ కార్డులు, మంజూరు లో నిబంధనలు పెట్టవద్దని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, పెన్షన్స్ సౌకర్యం కలిగించాలని, మరణించిన జర్నలిస్టులకు 25 లక్షలు ఎక్స్ప్రెస్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మేడి కవర్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఇమ్రాన్, డాక్టర్ వై మహేశ్వర్ రెడ్డి, ఏజీఎం ఖాదర్బాషా, ప్రశాంత్, కొండారెడ్డి, మదర్ థెరిసా ఇంటిగ్రేట్ నేషనల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ ఎల్ డి మణి తదితరులు పాల్గొన్నారు.



