కప్పట్రాళ్ల విద్యార్థినికి సన్మానం


కప్పట్రాళ్ల విద్యార్థినికి సన్మానం
కర్నూలు ప్రతినిధి నవంబర్ 26 యువతరం న్యూస్:
కప్పట్రాళ్ల గ్రామంలోని పేద విద్యార్థిని, (మైమూన్) మొదటి విడతలోనే శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ కాలేజ్, తిరుపతి నందు బియస్సి అగ్రికల్చర్ కోర్స్ అర్హత సాధించినందుకుగాను కప్పట్రాళ్ల గ్రామ దత్తపుత్రుడు ఆకే రవి కృష్ణ ఐపీస్ (ఐజీపీ – ఈగల్), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం- ప్రధాన కార్యదర్శి, డాక్టర్ డి. ప్రవీణ్ విద్యార్థినిని గుంటూరు నందు ఘనంగా సన్మానించడం జరిగింది. ఆకే రవి కృష్ణ ఐపీస్, నిరంతర ప్రోత్సాహం, సలహాలు & సూచనలు పాటించడం ద్వారా ఎంసెట్ లో ఉత్తమ ర్యాంకు సాధ్యమైందని విద్యార్థిని మైమూన్ తెలిపారు.
ఆకే రవి కృష్ణ ఐపీస్, అభ్యర్థన మేరకు తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పొట్లూరి రవి విద్యార్థిని మైమూన్ ను అన్ని రకాల ఫీజులు కట్టి ఇంటర్ చదివించారు. విద్యార్తిని మైమూన్ ఇంటర్ లో కూడా మంచి మార్కులతో ఉత్తిర్నత సాదించారు.
కప్పట్రాళ్ల గ్రామ దత్తపుత్రుడు ఆకే రవి కృష్ణ ఐపీస్, బియస్సి అగ్రికల్చర్ కోర్సు చదవడానికి 4 సంవత్సరాల కు అయ్యే ఖర్చును బొమ్మిడాలా ట్రస్ట్ ద్వారా విద్యార్తినికి సమాకూర్చారు. ఈ సంవత్సరము బొమ్మిడాల ట్రస్ట్ వారు కప్పట్రాళ్ల గ్రామామూలోని 5 మంది విద్యార్థులను ఫీజులను కట్టి చదిస్తున్నారు. ఈ కార్యక్రమములో గ్రామ వాస్తవ్యులు మండల వ్యవసాయ అధికారి ఆర్ అక్బర్ భాష విద్యార్థిని తల్లి, పాల్గొన్నారు.



