

నష్టపోయిన అరటి రైతుల ఆవేదన
ఎన్నడూ లేని విధంగా ధర పతనం
టన్ను రూ వేయి నుంచి మూడు వేలు..
ఆందోళనలో అరటి రైతులు…
ధర కల్పిస్తామని ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించిన ఫలితమేదీ..?
బుక్కరాయసముద్రం నవంబర్ 24 యువతరం న్యూస్:
బుక్కరాయసముద్రం మండలం అరటి రైతు కష్టకాలం వచ్చింది గతంలో ఎన్నడూ లేని విధంగా అరటి ధర భారీగా పతనమైంది. పక్షం రోజులుగా అరటి ధర అమాంతం తగ్గింది దీంతో లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు భారీగా నష్టపోతున్నారు. ప్రతి ఏడాది అరటి ధర ఎంత తగ్గినా పది నుంచి 15 పలుకుతూ వచ్చింది. ఏడాది అరటి దిగుబడి బాగానే వచ్చింది పంట చేతికి వచ్చే సమయానికి ధరలు అమాంతరం తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత నెల నారా క్రితం అరటి టన్ను 15000 నుంచి 20వేల వరకు ఉండేది తర్వాత ఆరు నుంచి ఏడు కు పడిపోయింది పక్షం రోజుల నుంచి అరటి నాణ్యత ఆధారంగా టన్ను వెయ్యి నుంచి మూడు వేలు దాకా ధర మాత్రమే పలుకుతుంది దీంతో ఏం చేయాలో తోచనే అయోమయంలో అరటి రైతులకు కొట్టుమిట్టలాడుతున్నారు ఈసారి పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియని అయోమయంలో ఉండిపోయారు.
లాభాలు వస్తాయన్న ఆశతో పంట సాగు..
బుక్కరాయసముద్రం మండలం తదితర మండలాల్లో అరటి పంట ఎక్కువగా సాగు చేస్తున్నారో అరటి పంట సాగుతో లాభాలు బాగా వస్తున్నాడంట జిల్లాలోని ఇతర రైతులు అరటి పంట సాగుపై మగ్గుచూశారు. ఎకరాలో అరటిపంట సాగుకు దాదాపు 1.50 లక్షల ఖర్చు అవుతుంది అరటి మొక్కను పెద్ద చేయాలంటే 9 నెలల సమయం పడుతుంది ఈ పంట కోసం ప్రతి రైతు ఎంతో ఆశతో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈసారి దిగుబడి బాగానే వచ్చింది ఏకలక పదవ అధ్యాయం నుంచి 20 టన్నుల దాకా దిగుబడి వచ్చింది పంట చేతికి వచ్చిన తర్వాత ధరలు భారీగా పడిపోవడంతో అరటి రైతుకు కన్నీలే మిగిలాయి..
పంటను వదిలేస్తున్న రైతులు..
ధర తక్కువ ఉండడంతో పలువురు రైతులు పొలాల్లోనే పంటను వదిలేస్తున్నారు. మరికొందరు దారి మధ్యలోనే లేక గొర్రెలకు ఇస్తున్నారు. బహిరంగ మార్కెట్లో వ్యాపారులు డజన్ అరటి 50 నుంచి 60 వరకు విక్రయిస్తుండటం గమన్నా ర్హం…
కన్నెత్తి చూడని కంపెనీలు..
జిల్లాలో పండించిన అరటి ఉత్పత్తులను 16 కంపెనీలు గల్ఫ్ దేశాలకు ఎగుమతులు చేస్తూ వస్తున్నాయి ఈసారి సదర్ కంపెనీలు రైతుల నుంచి అరటి పంటను కొనుగోలు చేయలేదు నాణ్యత లేదన్న సాగుతో కంపెనీలు అరటి పంట వైపు కన్నెత్తి చూడటం లేదు. లక్షల మీద పెట్టుబడులు వస్తున్నాయి పంటకు తెగులు ఉంటే పెట్టుబడి పెరుగుతుంది దిగుబడి బాగున్న ధరలు పడిపోవడంతో చెట్ల పైన కాయలు పాకానికి వచ్చి కుళ్ళిపోతున్నాయి. రైతులు డి. బాలకృష్ణారెడ్డి, ఓబులాపురం అమర్నాథ్ రెడ్డి,డి. పవన్ కుమార్ రెడ్డి, ప్రభుత్వం స్పందించి ఆదుకోకపోతే అరటి రైతుల పరిస్థితి ఆ గమ్య గోచరంగా ఉంటుంది.



