మా భాష మీద..మీ పెత్తనమేంటి..?

మా భాష మీద..మీ పెత్తనమేంటి..?
ఉత్తరాంధ్ర ప్రతినిధి నవంబర్ 19 యువతరం న్యూస్:
మాతృభాష రక్షణ కోసం సాగుతున్న “టిట్టిభ సత్యాగ్రహం” 10వ రోజుకు చేరుకొంది. తెలుగుదండు పిలుపు మేరకు.. పలువురు కవులు, కళాకారులు, భాషాభిమానులు దీక్షలో పాల్గొని “మాతృభాషా ప్రతిజ్ఞ” చేశారు.
పది రోజులుగా.. దీక్షా నియమాలు పాటిస్తున్న తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు సూరి మాట్లాడుతూ.. మన మాతృభాష మీద, ఈ దేశవాళీ పాలకుల పెత్తనమేంటి ? ప్రవేటు పాఠశాలల సంక్షేమం కోసం ఇంకెంత కాలం.. తెలుగు భాషను, తెలుగు జాతిని పణంగా పెడతారు ? ఈ దిక్కుమాలిన పాలకుల కుళ్లు రాజకీయాలకు అంతం లేదా ? అంటూ.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు.
బుధవారం దీక్షా వేదికకు మద్దతుగా..విశాఖ గాయనీ గాయకుల సంఘ సభ్యులు విచ్చేసి తెలుగు పాటలతో ‘తెలుగుతల్లి’కి నీరాజనాలు సమర్పించారు.
కార్యక్రమంలో.. తిరుపతి రాజమన్నార్, డా.కొచ్చెర్లకోట, ఆచార్య సూరప్పడు, అడపా రామకృష్ణ, చేబియ్యం రవిమోహన్,ఏలూరి లక్ష్మీ, బాదం మణికుమారి, అల్లు వెంకట రమణ,విశాఖ గాయనీ గాయకుల సాంస్కృతిక సంఘ సభ్యులు.. బయ్యా శ్రీనివాసరావు, భూపతిరావు,ఎం.వి.ఆర్.నాగేశ్వరరావు, ఫణిస్వామి,కృష్ణంరాజు..తదితరులు పాల్గొన్నారు.



