రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు
వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు
వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్
బందోబస్తు సమయంలో విధుల పట్ల పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
కడప ప్రతినిధి నవంబర్ 18 యువతరం న్యూస్:
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 19వ తేదీన పెండ్లిమర్రి మండలంలోని చిన్నదాసరిపల్లి, వెల్లటూరు పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై పగడాలపల్లి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బ్రీఫింగ్ నిర్వహించి పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమం ప్రారంభం నుండి ముగిసే వరకు ప్రతి అధికారి, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి తమ విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలంటూ ఎస్పీ సూచించారు. వెల్లటూరు లోని హెలిప్యాడ్, ముఖ్యమంత్రి కాన్వాయ్ మార్గం, ప్రజా వేదిక ప్రాంతాల పరిసరాలు, అలాగే రూట్ బందోబస్త్ విధులు నిర్వహించే సిబ్బంది కాన్వాయ్ వచ్చే సమయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. విధులు నిర్వహించే సిబ్బంది సమయస్పూర్తితో, క్రమశిక్షణతో వ్యవహరించాలన్నారు. కార్యక్రమానికి వచ్చే వాహనాలు కేటాయించిన స్థలాల్లోనే పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. అనంతరం హెలిప్యాడ్ నుండి ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమ ప్రాంతం వరకు కాన్వాయ్ రిహార్సల్స్ ను నిర్వహించి జిల్లా ఎస్పీ పరిశీలించారు. ముఖ్యమంత్రి కార్యక్రమం పూర్తయ్యేంతవరకు అప్రమత్తంగా ఉంటూ బందోబస్తు నిర్వహిస్తూ పర్యటనను విజయవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్.పి (పరిపాలన) కె.ప్రకాష్ బాబు, అదనపు ఎస్.పి (ఏ.ఆర్) బి.రమణయ్య, సి.ఎం సెక్యూరిటీ అధికారి ఎస్.ఎస్.ఎస్.వి కృష్ణారావు, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి ఎన్.సుధాకర్ , జిల్లాలోని, ఇతర జిల్లాల నుండి బందోబస్తు నిమిత్తం వచ్చిన డి.ఎస్.పి లు, సి.ఐ లు, ఎస్.ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



