రాష్ట్ర ముఖ్యమంత్రి కడప జిల్లా పర్యటన ఖరారు
ముఖ్యమంత్రి షెడ్యూల్ వివరాలు

రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఖరారు
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప ప్రతినిధి నవంబర్ 18 యువతరం న్యూస్:
వైయస్సార్ కడప జిల్లా నవంబర్ 18 రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నవంబర్ 19వ తేదీన పెండ్లిమర్రి మండల పర్యటన ఖరారైందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ మేరకు ముఖ్యమంత్రి ఒక్కరోజు పర్యటన వివరాలను తెలియజేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా.. ప్రజా వేదిక అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొంటారు. తదనంతరం రైతుల తో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.
సీఎం షెడ్యూల్ వివరాలు :-
మధ్యాహ్నం 1.15 నిమిషాలకు పెండ్లిమర్రి మండలం జెడ్పి హై స్కూల్ వెల్లటూరు, హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.15 నిమిషాల నుండి మధ్యాహ్నం 1.25 నిమిషాల మధ్య ప్రజా ప్రతినిధులు మధ్యాహ్నం 1.25 నిమిషాలకు రోడ్డు మార్గాన బయలుదేరి మధ్యాహ్నం 1.30 నిమిషాలకు మన గ్రోమోర్ సెంటర్, వెల్లటూరు, పెండ్లిమర్రి మండలం చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1.35 నిమిషాలకు మన గ్రోమోర్ సెంటర్(ఎరువుల దుకాణం) సందర్శన మరియు రైతులతో ముఖాముఖి మధ్యాహ్నం 1.40 నిమిషాలకు రోడ్డు మర్గాన ప్రజా వేదిక చేరుకుని మధ్యాహ్నం 1.40 నిమిషాల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు పెండ్లిమర్రి మండలంలో “అన్న దాత సుఖీభవ – పీఎం కిసాన్” కార్యక్రమం లో పాల్గొంటారు. సాయంత్రం 4.15 నిమిషాలకు రోడ్డు మర్గాన ప్రజా వేదిక నుండి బయలుదేరి సాయంత్రం 4.20 నిమిషాలకు చిన్న దాసరి పల్లి చేరుకుంటారు. సాయంత్రం 4.20 నిమిషాల నుండి సాయంత్రం 5.05 నిమిషాల వరకు చిన్నదాసరిపల్లి గ్రామం, పెండ్లిమర్రి మండలంలో వ్యవసాయ క్షేత్రాల పరిశీలన, రైతుల తో ముఖాముఖి.సాయంత్రం 5.15 నిమిషాలకు వెల్లటూరు గ్రామం, పెండ్లిమర్రి మండలంలో పార్టీ క్యాడర్ మీటింగ్ సమావేశం వేదికను చేరుకుంటారు. సాయంత్రం 5.15 నిమిషాల నుండి సాయంత్రం 6.15 వరకు వెల్లటూరు గ్రామం, పెండ్లిమర్రి మండలంలో క్యాడర్ మీటింగ్ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 6.15 నిమిషాలకు వెల్లటూరు గ్రామం, పెండ్లిమర్రి మండలం నుండి రోడ్డు మర్గాన బయలుదేరి సాయంత్రం 6.40 నిమిషాలకు కడప విమానాశ్రయం చేరుకుని సాయంత్రం 6.50 నిమిషాలకు కడప నుంచి బయలు దేరి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుని, రాత్రి 8.55 నిమిషాలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.



