కోడుమూరులో హిందూ సంఘాల ధర్నా

కోడుమూరులో హిందూ సంఘాల ధర్నా
కోడుమూరు నవంబర్ 3 యువతరం న్యూస్:
హిందుత్వం గురించి,హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ హిందూ దేవుళ్ళ పై కోడుమూర్ లో ఓ చికెన్ షాపు నిర్వహిస్తున్న కటిక శేషావలి అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషియల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో హిందూ సంఘ నాయకులు, బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోడుమూరులో ఆందోళన చేపట్టారు.శ్రీ నీలకంఠేశ్వర గుడి నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చి ఎస్సై ఎర్రిస్వామికి వినతి పత్రం అందజేశారు. కర్నూలు జిల్లాలోని పక్షిమ దిశన ఉన్న శ్రీ ఉరుకుంద స్వామి వీరన్న గురించి ఆయనను కొలిచే భక్తుల గురించి అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుచూ హిందువుల మనోభావాలు దెబ్బ తిసే విధంగా స్వామి గురించి అసభ్యంగా మాట్లాడాలని హిందువులు ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ దేవతల చిత్రపటాలను నేలపై వేసి తొక్కుతున్న వీడియోలను షేర్ చేయు లాంటివి చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించాడని తెలిపారు. హిందూ దేవుళ్ళపై , హిందువుల మనోభావాలు దెబ్బ తినే విధంగా పోస్టులు పెట్టిన కటిక శేషావలిపై కేసు నమోదు చేసి శిక్షించాలని కోడుమూరు కు చెందిన ఉరుకున్న ఈరన్న స్వామి భక్తులైన ఉరుకుంద యాదవ్, గోపాల్ నాయుడు, మహేష్ నాయుడు,తాయప్ప,నాగేశ్వరరావు అతనిపై ఫిర్యాదు చేశారు.దీనిపై కోడుమూరు ఎస్సై డి ఎర్రిస్వామి కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందుతుణ్ణి అదుపులోకి తీసుకోని విచారణ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు ఆర్ఎస్ఎస్ నాయకులు, హిందూ సంఘాల నాయకులు, బిజెపి నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



