ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
అధ్యక్షులుగా అవ్వరు కృష్ణ,ప్రధాన కార్యదర్శిగా శంకర్ రెడ్డి

ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
అధ్యక్షులుగా అవ్వరు కృష్ణ
ప్రధాన కార్యదర్శిగా శంకర్ రెడ్డి
మంగళగిరి ప్రతినిధి నవంబర్ 2 యువతరం న్యూస్:
ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎయిమ్స్ వైద్యశాల వద్ద గల ఎకో పార్కు నందు ఆదివారం ఉదయం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా అవ్వారు కృష్ణ, గౌరవాధ్యక్షులుగా పూర్వపు అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా ఆలేటి పూర్ణ, చంద్రకేవి వెంకట దుర్గారావు, ప్రధాన కార్యదర్శిగా కే శంకర రెడ్డి, సహాయ కార్యదర్శులుగా డోగిపర్తి నరేంద్ర, బాణాల నాగేశ్వరరావు, ట్రెజరర్ గా నేరెళ్ల లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులుగా కుక్కమళ్ళ ప్రభాకర్, షేక్ అహ్మద్ షరీఫ్, తిరువీధుల నరసింహమూర్తి, కనిగిరి శ్రీరాములు, రుద్రు మోహన్, సలహా కమిటీ సభ్యులుగా మంచా విజయ్ మోహన్, జిలాని, అంకం శ్రీనివాసరావు (బాబు), ఎలీషా, విఠల్ రావు, వీసం వెంకటేశ్వరరావు, హరిశ్చంద్ర ప్రసాద్, బాణాల రామారావు, కొమ్మారెడ్డి వీరారెడ్డి, జంజనం వెంకట సాంబశివరావు, గోలి బాలమోహన్, షేక్ హుస్సేన్ లను ఎన్నుకున్నారు. ప్రస్తుత కార్యవర్గ కాల పరిమితి రెండేళ్ల పాటు ఉంటుందని వీసం వెంకటేశ్వరరావు తెలిపారు. వాకర్స్ మధ్య ఏర్పడిన విభేదాలను పీకే కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ పూర్వపు గౌరవాధ్యక్షులు తాజా సలహా కమిటీ సభ్యులు మంచా విజయ్ మోహన్ రావు పరిష్కరించి సమన్వయం చేశారు.



