ANDHRA PRADESHEDUCATIONOFFICIALWORLD

భాషా సాహిత్య సంపద పరిరక్షణ బాధ్యత అందరిదీ..!

సి.పి.బ్రౌన్ బాషా పరిశోధనా కేంద్రాన్ని సందర్శించిన భారత మాజీ ఉప రాష్ట్రపతి, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ఎం. వెంకయ్యనాయుడు

భాషా సాహిత్య సంపద పరిరక్షణ బాధ్యత అందరిదీ..!

సి.పి.బ్రౌన్ బాషా పరిశోధనా కేంద్రాన్ని సందర్శించిన భారత మాజీ ఉప రాష్ట్రపతి, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ఎం. వెంకయ్యనాయుడు

కడప ప్రతినిధి నవంబర్ 2 యువతరం న్యూస్:

భాషా, సాహిత్య సంపదను భావితరాలకు వారసత్వ సంపదగా అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, భారత మాజీ ఉప రాష్ట్రపతి, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా.. ఆదివారం ఉదయం కడప సి.పి.బ్రౌన్ సాహిత్య పరిశోధన గ్రంథాలయాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ఎం. వెంకయ్యనాయుడు సందర్శించారు.ఆయనతో పాటు.. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు డా. జస్టిస్ వెంకట జ్యోతీర్మయి ప్రతాప, కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, వైవియూ విసి.ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్, కేంద్ర సాహిత్య ఆకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, శతావదానులు డా. మెడసాని మోహన్, రేవూరి అనంత పద్మనాభం, 20 లక్షల పుస్తకాలను సేకరించిన అంకె గౌడ, ఆకాశవాణి పూర్వపు సంచాలకులు, గుమ్మడి గోపాలకృష్ణ , ఎస్బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ హేమ, జానుమద్ది సాహితీపీఠం నిర్వాహకులు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు సిపి బ్రౌన్ భాషాపరిశోధన కేంద్ర గ్రంథాలయ భవనంలోని జనుమద్ది సాహితీ పీఠం, గ్రంథాలయంలోని అన్ని విభాగాలను సందర్శించి గ్రంథ పరిమళాన్ని ఆస్వాదించారు. ముందుగా యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న సి.పి.బ్రౌన్ బాషా పరిశోధనా కేంద్రంలో.. జానుమద్ది సాహితీపీఠం వారి సౌజన్యంతో ప్రతిష్టించిన తెలుగు సూర్యుడు, తెలుగు భాషా సముపార్జకుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారి విగ్రహాన్ని పరిశీలించిన అనంతరం.. సి.పి. బ్రౌన్ పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఛాయాత్రాలను ఒక్కొక్కటిగా తిలకించారు. అంతేకాకుండా గ్రంధాలయంలో నిక్షిప్తం చేసిన అమూల్యమైన, వెలకట్టలేని పురాతన తాళపత్ర గ్రంథ నిధిని, పరిశోధనా గ్రంథాలను, పలు రకాల గ్రంథాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగు బాషా సాహితీ సౌరభంలో మణి దీపంలా వెలుగొందుతున్న సి.పి.బ్రౌన్ బాషా పరిశోధనా కేంద్రాన్ని సందర్శించడం తనకు చాలా సంతృప్తినిచ్చిందన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న సి.పి.బ్రౌన్ బాషా పరిశోధనా కేంద్రం విస్తరణాభివృద్ధికి, యూనివర్సిటీ భాషా పరిశోధక యంత్రాంగం చేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. అనంతరం ఆదరణ, ఔన్నత్యాన్ని కోల్పోయే స్థితిలో ఉన్న తెలుగు భాష సాహిత్యాన్ని పునర్లిఖించిన ఆంగ్లేయ సాహితీ శిఖరం.”చార్లెస్ ఫిలిప్ బ్రౌన్” అని ఆయన సేవలు తెలుగు భాషా సాహితీవేత్తలకు ఆదర్శనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, కే ఎంసి కమిషనర్ మనోజ్ రెడ్డి, బ్రౌన్ గ్రంథాలయ సలహామండలి సభ్యులు జానమద్ది విజయభాస్కర్, బ్రౌన్ గ్రంథాలయ సంచాలకులు డా. జి. పార్వతి, లైబ్రరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!