డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థుల ఇండస్ట్రియల్ విజిట్


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థుల ఇండస్ట్రియల్ విజిట్
వెల్దుర్తి నవంబర్ 2 యువతరం న్యూస్:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో 9, 10 ,జూనియర్ ఇంటర్ మరియు సీనియర్ ఇంటర్ విద్యార్థినిల కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి లక్ష్మీప్రసన్న అధ్యక్షతన ఇండస్ట్రియల్ విజిట్ ఐటిఐటిఎస్ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ ట్రేడ్ లపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐటిఐటిఎస్ విద్యార్థులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు శ్రీ లక్ష్మీ ప్రింటింగ్ ప్రెస్ ను ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ లోని భాగంగా సోలార్ ఇండస్ట్రీ మరియు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వాటర్ ప్యూరిఫైయర్ ను సందర్శించారు. ఒకేషనల్ ట్రైనర్స్ 1.జి సౌజన్య (ఐటిఐటిఎస్ )2.కే రాజమ్మ ఈ (అండ్ హెచ్) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి ఇండస్ట్రియల్ విజిట్ ద్వారా విద్యార్థులకు ప్రయోగిక పరిజ్ఞానం పెరుగుతుందని యూనియన్ బ్యాంక్ మేనేజర్ శైలేందర్ వివరించారు.



