
బినిగేరి నుండి శ్రీశైలం కి పాదయాత్ర
800 మంది తో పాదయాత్ర
ఆస్పరి నవంబర్ 2 యువతరం న్యూస్:
మండల పరిధిలోని బినిగేరి గ్రామ కొండల్లో వెలిసిన శ్రీ పంచలింగేశ్వర స్వామి వారి ఆలయం నుండి శ్రీశైలం కి పాదయాత్రగా బయలుదేరారు. ఆదివారం ఉదయం స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ నిర్వాహకులు శ్రీనివాస నాయన ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఆశ్రమ గురువు శ్రీనివాస నాయన మాట్లాడుతూ కార్తీకమాసంలో పాదయాత్ర చేసి శివుని దర్శించుకుంటే ఎంతో మేలు కలుగుతుందన్నారు. రెండు రోజులపాటు ఫారెస్ట్ లో పాదయాత్ర జరుగుతుందన్నారు. సోమవారం శ్రీశైలం చేరుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దాదాపుగా 800 మంది భక్తులు పాదయాత్రలో పాల్గొని స్వామివారిని ముక్కులు తీర్చుకుంటారు. ఫారెస్ట్ అడవులలో పాటలు పాడుకుంటూ సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, కృష్ణారెడ్డి,రవిచంద్ర,వీరేష్ సుధా,భీమన్న, నాగరాజు తలారి సూరి,ముక్కన్న,తిక్కయ్య,గురూజీ,సంతోష్ స్వామి, బాలాజీ స్వామి, అనిల్ స్వామి, నీలకంఠ,దత్తాత్రేయ రెడ్డి,భాస్కర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.



