ANDHRA PRADESHDEVOTIONALWORLD
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని సన్నిధికి భక్తుల పాదయాత్ర


కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని సన్నిధికి భక్తుల పాదయాత్ర
కోడుమూరు నవంబర్ 2 యువతరం న్యూస్:
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా దాదాపు 300 మంది భక్తులు పాదయాత్ర శనివారం నాడు కర్నూలు పట్టణం నుంచి మొదలుపెట్టారు. ఆదివారం నాటికి కాల్వబుగ్గ చేరుకున్నారు. అక్కడ భక్తులకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నదానం నిర్వహించారు. సమాజంలోని ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మికం వైపు నడపడమే మా ఉద్దేశమని భక్తి చైతన్య మహాపాదయాత్ర సభ్యులు తెలిపారు. ఈ పాదయాత్ర ఈనెల 13 వరకు కొనసాగి తిరుమలకు చేరుకుంటామని సభ్యులు తెలిపారు. పాదయాత్ర గుండా వెంకటేశ్వర స్వామి కీర్తనలు ,భజనలతో భక్తులు పారవశ్యం చెందుతూ వెంకటేశ్వర స్వామి వాహనం తో పాదయాత్ర కొనసాగుతుందని భక్తులు తెలియజేశారు.



