చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవు


చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవు
నూతన ఎస్సైగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేష్
వెల్దుర్తి నవంబర్ 2 యువతరం న్యూస్:
వెల్దుర్తి నూతన ఎస్సైగా నరేష్ శనివారం పదవి బాధ్యతలు చేపట్టారు. మొదట ఆయన వెల్దుర్తి మండలంలోని ప్రముఖ సేవ క్షేత్రమైన శ్రీ బ్రహ్మ గుండేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో పూజా కార్యక్రమాల తర్వాత పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై నరేష్ మాట్లాడుతూ చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు. సమస్యలు ఏవైనా పోలీస్ స్టేషన్ దృష్టికి తీసుకుని రావాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి రోడ్డు ప్రమాదాలను అరికడతామన్నారు. ఎస్సై నరేష్ ను ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ అశోక్, ట్రైనీ ఎస్సై దివ్యశ్రీ, మరియు సిబ్బంది పాల్గొన్నారు.



