మన గ్రోమోర్ సెంటర్లో బడామోసం…
నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే నా..?


నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే నా..?
మన గ్రోమోర్ సెంటర్లో బడామోసం…
బుక్కరాయసముద్రం అక్టోబర్ 31 యువతరం న్యూస్:-
జిల్లా లో గ్రోమోర్ సెంటర్ లో బడా మోసానికి తెరతీశారు.గత వారం కిందట వెంకటాపురం రైతులు వరి మొక్కజొన్న పంటలకు కొన్ని రకాల మందులు తీసుకెళ్లడం జరిగింది.అందులో 5కేజీల మందుకు బదులుగా అంత ఇసుక రావడం రైతులు ఆశ్చర్యానికి గురయ్యారు.ఇసుక కు మొత్తం నీలి రంగు వేసి కలిపి రైతులను కొత్త మోసానికి తెరతీశారు.రైతులనే మోసం చేస్తే ఎలా అని లోబో దిబో మంటున్న రైతులు ఎన్నో ఆశలు పెట్టుకొని రైతులు పంట పెట్టుకుంటే రైతులనే ఇలా మోసం చేస్తే ఎలా
అగ్రికల్చర్ ఆఫీసర్ మాట్లాడుతూ ఎంక్వైరీ కి వచి పరిశీలించి ల్యాబ్ కు తరలించి రిపోర్ట్ ఆధారంగా మన గ్రోమోర్ సెంటర్ పై చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. అన్ని పర్టీలైజర్ షాప్ లని తనికి చేస్తాం అని వెల్లడించారు. నకిలీ మందులు వాడారని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని వెల్లడించారు. రైతులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వని గ్రోమోర్ సెంటర్ సిబ్బంది షాప్ కు సంబంధించి ఇన్వాయిస్ లు కూడా లేని మన గ్రోమోర్ సెంటర్ రైతులు మాట్లాడుతూ ఇంతకుముందే ఇదే మన గ్రోమోర్ సెంటర్లో ఇలానే జరిగింది. అప్పుడు మన గ్రోమోర్ సిబ్బంది ఫీల్డ్ కి వచ్చి మాకు మబ్బి చెప్పి మమ్ములను నోరు మూయించారు. మాకేనా ఇలాంటి మందులు ఇస్తున్నది ఇంకా ఎంత మంది రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి మన గ్రోమోర్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలని రైతులు నాగార్జున, మంజునాథ్, రామంజి, రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
 
				 
					


