ANDHRA PRADESHOFFICIALPROBLEMSSTATE NEWS
వి ఆర్ ఎస్ పి వాగు ఉద్ధృతి పరిశీలించిన ఎమ్మెల్యే

వి ఆర్ ఎస్ పి వాగు ఉద్ధృతి పరిశీలించిన ఎమ్మెల్యే
కొత్తపల్లి అక్టోబర్ 30 యువతరం న్యూస్:
మెంథా తుఫాన్ కారణంగా ఆత్మకూరు పట్టణం నుంచి కొత్తపల్లి మండల పరిధిలోని దుద్యాల గ్రామానికి వెళ్లే దారిలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వి ఆర్ ఎస్ పి వాగును బుధవారం నందికొట్కూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయ సూర్య పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొంథా తుఫాన్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దన్నారు. వాగు ఉధృతి పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాలలో ఉండాలన్నారు. ప్రజలకు కావలసిన సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు.ఆయన వెంట పగిడ్యాల కన్వీనర్ పలుచని మహేశ్వర్ రెడ్డి,టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



