ANDHRA PRADESHBREAKING NEWSCRIME NEWSPROBLEMSSTATE NEWS
భవనాశి వాగులో వ్యక్తి గల్లంతు

భవనాశి వాగులో వ్యక్తి గల్లంతు
జెలం నాగేశ్వరరావు నాగంపల్లి గ్రామం
కొత్తపల్లి అక్టోబర్ 30 యువతరం న్యూస్:
పాములపాడు చెలిమిల్ల వెళ్లే దారిలో భవనాశి వాగు ఉద్ధృతికి ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. కొత్తపల్లి మండలంలోని నాగంపల్లి గ్రామానికి చెందిన జెలం నాగేశ్వరరావు,వెంకటేశ్వర్లు కలిసి బుధవారం పాములపాడుకు మందులు తెచ్చేందుకు వెళ్లారు.తీసుకొని తిరిగి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా భవనాశి వాగు అద్భుతంగా ప్రవహిస్తున్న వాగుపై వెళ్లారు ద్విచక్రవాహనంతో సహా ఇద్దరు.నీటిలో.కొట్టుకపోయారు. వెంకటేశ్వర్లు ఒక చెట్టును పట్టుకోవడంతో స్థానికులు ఒడ్డుకు చేర్చారు.నాగేశ్వరరావు కోసం పోలీసులు గాలిస్తున్నారు.



