ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే దగ్గుపాటి ఆకస్మిక తనిఖీలు
వైద్యులు సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవన్న ఎమ్మెల్యే


ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే దగ్గుపాటి ఆకస్మిక తనిఖీలు
ఓపీ చీటీలు ఇవ్వడం దగ్గర నుంచి ప్రతి విభాగం తనిఖీ
వైద్యులు సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవన్న ఎమ్మెల్యే
అనంతపురం వైద్యం అక్టోబర్ 29 యువతరం న్యూస్:
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు,బుధవారం ఉదయం ఆయన ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపి స్లిప్పులు ఇచ్చే గదుల దగ్గర నుంచి అన్ని విభాగాలను ఆయన పరిశీలించారు. ప్రతి ఓపీని, వార్డులను, ఫార్మసీను కూడా పరిశీలించారు. రోగులతో మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. చాలా విభాగాల్లో 9:30 అయినా వైద్యులు రాకపోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకు ఇంత సమయమైనా వైద్యులు రావడం లేదు, ఎంతవరకు ఓపి నడుస్తుంది అన్న అంశాలపై సూపర్డెంట్ తో మాట్లాడారు. మరోసారి వైద్యులు ఇలా సమయపాలన పాటించకపోతే చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు. అలాగే ఆసుపత్రిలో ఎంత మంది ఇన్ పేషెంట్లు ఉన్నారు.. ప్రతిరోజు ఔట్ పేషెంట్లు ఎంత వరకు వస్తున్నారన్నది కూడా తెలుసుకున్నారు. అక్కడున్న సౌకర్యాలపై కూడా ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్య సేవలు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ.. గత 20 ఏళ్ల నుంచి ప్రభుత్వాసుపత్రి 560 పడకలగా మాత్రమే ఉండటం వలన ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ప్రతిరోజు ఇన్ పేషెంట్లు 2000 నుంచి 200500 మంది వరకు ఉన్నారని.. అలాగే ఔట్ పేషెంట్లు 1200 మంది వరకు వస్తున్నారన్నారు. ప్రస్తుతం ఆసుపత్రికి వచ్చే బడ్జెట్, వైద్యులు, సిబ్బంది, సౌకర్యాలు చాలడంలేదన్నారు. ఇదే అంశాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కూడా చర్చించామని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. త్వరలోనే 1200పడకల ఆసుపత్రిగా మారుస్తామని స్పష్టం చేశారు. సిబ్బంది ఎక్కడైనా రోగుల వద్ద నుంచి డబ్బులు తీసుకున్నా.., విధుల్లో నిర్లక్ష్యం వహించిన, వైద్యులు సమయపాలన పాటించకపోయినా గట్టి చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే దగ్గుపాటి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ ఆర్ఎంఓ హేమలత, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కోనంకి గంగారం, రత్నమయ్య తదితరులు పాల్గొన్నారు.



