జాతీయ స్థాయి మాథ్స్ క్వాలిఫైయర్ పరీక్షలో శ్రీ చైతన్య ప్రభంజనం
అనంతపురం ఐపిల్ విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు

జాతీయ స్థాయి మాథ్స్ క్వాలిఫైయర్ పరీక్షలో శ్రీ చైతన్య ప్రభంజనం
అనంతపురం ఐపిల్ విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు
అనంతపురం ప్రతినిధి అక్టోబర్ 28 యువతరం న్యూస్:
కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన (ఐ ఓ క్యూ ఎమ్)ఇండియన్ ఒలింపియాడ్ క్వాలిఫైయర్ ఇన్ మాథెమాటిక్స్ లో శ్రీ చైతన్య విద్యార్థులు ఆంద్రప్రదేశ్ రాష్ట్రoలో 201 మంది ఉత్తీర్ణత సాధించగా వారిలో అనంతపురం-5 ఐపిఎల్ బ్రాంచి నుండి ఎనిమిది మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు, అందులో ఐ పి ఎల్ పదవ తరగతికి చెందిన ఆరుగురు విద్యార్థులు బి. ఆదిత్య కృష్ణ, జి. ప్రేమ్ కుమార్, ఎస్. ప్రణీత్, ఎస్ రుత్విక్ రెడ్డి, జి భగీరథ్ రెడ్డి ఎం. యశ్వంత్ రెడ్డి మరియు 9 వ తరగతి ఐపీఎల్-ఐ సి నుండి ఈ. గగన్ సాయి, ఎన్. నితిన్ సాయి లు ఉన్నారు ఈ సందర్భంగా అనంతపురం జోన్ ఏ. జి. ఎమ్
కె.సుబ్బారెడ్డి విద్యార్థులను అభినందిస్తూ ఉపాధ్యాయల కృషి, విద్యార్థుల శ్రద్ధ చూపడం వలన ఈ ఫలితాలు సాధించారని తెలిపారు, ఈ విద్యార్థులు ఆర్ ఏం ఓ పరీక్షకు అర్హత పొందారు.
ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ నరేష్ కుమార్,జోనల్
కోఆర్డినేటర్ రాధాకృష్ణ నాయుడు, ఐ పి ఎల్ ఇంచార్జి శ్రీనివాస్ పట్నాయక్ ఒలంపియాడ్ ఇంచార్జి ధనుంజయ నాయుడు మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర బృందం పాల్గొన్నారు.



