

ఉపాధి హామీ పనులు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ఏపీడీలు ఉదయం 6 గంటలకు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలి,పనుల్లో పురోగతి తీసుకురావాలి
పిజిఆర్ఎస్ అర్జీలను గడువు తీరకుండానే తప్పకుండా పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్
అనంతపురం కలెక్టరేట్ అక్టోబర్ 28 యువతరం న్యూస్:
ఉపాధి హామీ పనులు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఇందులో అలసత్వం ఉండరాదని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో మొంథా తుఫాన్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ఉపాధి హామీ పథకం, ఈ-పంట నమోదు, ఏపీఎంఐపి, హౌసింగ్, తదితర అంశాలపై ఆయా శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, ఎస్డీసీలు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర శాఖల క్షేత్రస్థాయి అధికారులతో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు,ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద లేబర్ టర్నవుట్ కి సంబంధించి గత వారంలో 3 లక్షల 72 వేల లక్ష్యం ఉండగా, కేవలం 77,319 మంది కూలీలను మొబిలైజేషన్ చేశారని, ఇది ఎంత మాత్రం తగదన్నారు. జిల్లాలోని విడపనకల్లు, నార్పల, డి.హీరేహాల్, వజ్రకరూరు, పెద్దపప్పూరు, తదితర 15 మండలాల్లో 20 శాతం కన్నా తక్కువగా లక్ష్యాన్ని చేరుకున్నారన్నారు. ఈనెల 20వ తేదీ నుంచి 25వతేదీ వరకు విడపనకల్లు మండలంలో 12,600 లక్ష్యానికి గాను 1,101 చేరుకుని 8.74 శాతం మాత్రమే లక్ష్యాన్ని చేరుకున్నారని, నార్పల మండలంలో 18 వేలకు 1,846 చేసి 10.26 శాతం లక్ష్యం పూర్తి చేశారని, డి.హీరేహాల్ మండలంలో 9600 లక్ష్యానికి గాను 1,015 చేసి 10.57 శాతం మాత్రమే లక్ష్యం పూర్తి చేయడం జరిగిందన్నారు. ఆయా మండలాల్లో వెంటనే ఉపాధి పనుల లేబర్ టర్నవుట్ లో పురోగతి తీసుకురావాలని, సంబంధిత ఏపీడీలు మండలాల్లో తనిఖీలు చేయాలని, రోజు ఉదయం 6 గంటలకు క్షేత్రస్థాయికి వెళ్లి పనులను మానిటర్ చేయాలని, ఉపాధి పనుల్లో పురోగతి తీసుకురావాలని ఆదేశించారు. పనుల్లో పురోగతి తీసుకురాకపోతే చర్యలు తీసుకునేందుకు వెనకాడమన్నారు. విడపనకల్లు, బ్రహ్మాసముద్రం మండలాల ఎంపీడీవోలు 15 వర్క్ సైట్ తనిఖీలలో ఒకటి చేయలేదని, వెంటనే పూర్తి చేయాలన్నారు. హార్టికల్చర్ ప్లాంటేషన్ కి సంబంధించి 100 శాతం లక్ష్యం చేరుకోవాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్, పల్లెవనాలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపి మంజూరులు తీసుకుని గ్రౌండింగ్ చేయాలని, ఇప్పటికే మంజూరులు తీసుకున్న వాటిని పూర్తి చేయాలన్నారు. ఫారంఫండ్ పనులు, వ్యక్తిగత సోక్ పిట్లు, కమ్యూనిటీ సోక్ పిట్లను లక్ష్యానికి అనుగుణంగా గ్రౌండ్ చేసి పూర్తి చేయాలని, 90 రోజుల హౌసింగ్ కి సంబంధించి పురోగతి తీసుకురావాలని, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ చేపట్టడంలో వేగం పెంచాలన్నారు. హౌసింగ్ కి సంబంధించి ఆవాస్ ప్లస్ 2024 సర్వే రిపోర్ట్ లో సర్వేయర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఈకేవైసీ పూర్తి చేయాలని, వచ్చే నెల 5వ తేదీలోపు లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు,ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) అర్జీలను గడువు తీరకుండానే తప్పకుండా పరిష్కరించాలని, బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లడానికి వీలులేదని, ఇప్పటికే పెండింగ్ ఉన్న 39 బియాండ్ ఎస్ఎల్ఏలను వెంటనే పరిష్కరించాలన్నారు. అర్జీలను సరైన సమయంలో గడువులోపు నాణ్యతగా పూర్తి చేయడం ఎంతో ముఖ్యమైనదని, వచ్చే సోమవారం నాటికి బియాండ్ ఎస్ఎల్ఏ అర్జీలు పెండింగ్ ఉంటే సంబంధిత శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫీడ్బ్యాక్ సర్వేలో సంతృప్త స్థాయి మరింత పెరగాలని, బొమ్మనహల్, సెట్టూరు తదితర మండలాల్లో ఆర్డీవోలు పర్యటించాలని, ఫీడ్బ్యాక్ సర్వేలో మరింత పురోగతికి కార్యచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ పంట సర్వేకి సంబంధించి 100 శాతం నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు,మొంథా తుఫాను కారణంగా భారీ వర్షాల ప్రభావం వలన దెబ్బతిన్న జిల్లాలకు అవసరం మేరకు ఉన్నత స్థాయి ఆదేశాల మేరకు జిల్లాలోని డిపిఓ, పిఆర్, డిఎంహెచ్ఓ, ఆర్.అండ్.బి, వ్యవసాయ, పలు శాఖల పరిధిలో అధికారులు, సిబ్బంది సహాయక చర్యలకు హాజరయ్యేందుకు మెన్ మరియు మెటీరియల్ సిద్ధం చేసుకుని సన్నద్ధంగా ఉండాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పనాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ, సిపిఓ అశోక్ కుమార్, హౌసింగ్ పిడి శైలజ, డ్వామా పిడి సలీమ్ భాష, డిపిఓ నాగరాజునాయుడు, జడ్పి సిఈఓ శివ శంకర్, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, ఏపీఎంఐపి పిడి రఘునాథరెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.



