ANDHRA PRADESHPROBLEMSSTATE NEWS
ఈనెల 29 న చలో విజయవాడ


ఈనెల 29 న చలో విజయవాడ
వెల్దుర్తి అక్టోబర్ 28 యువతరం న్యూస్:
గ్రామ రెవెన్యూ సహాయకులకు పేస్కేలు 2018 నుండి ఇవ్వాలని వెల్దుర్తి మండల గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్షులు తలారి అయ్య స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నామినీలను వీఆర్ఏలుగా ప్రభుత్వం గుర్తించాలన్నారు. రీ సర్వే విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏలకు టిఏ మరియు డిఏలు చెల్లించాలన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను ఒప్పుకోకపోతే ఈనెల 29న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వీఆర్ఏలు పాల్గొన్నారు.



