బ్యాట్ పట్టిన బైరెడ్డి, నేనూ కూడా క్రికెటర్ నే
మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి


బ్యాట్ పట్టిన బైరెడ్డి, నేనూ కూడా క్రికెటర్ నే
మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి
కర్నూలు క్రీడలు అక్టోబర్ 28 యువతరం న్యూస్:
కళలు, క్రీడలకు పుట్టినిల్లు అని, ఎంతో మంది క్రీడాకారులను రాయలసీమ అందించిందని రాయలసీమ ఉద్యమనేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు.
సోమవారం సాయంత్రం కర్నూలు పరిధిలోని మునగాలపాడు వద్ద ఆర్. కె రాయలసీమ క్రికెట్ అకాడమిని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్బంగా బైరెడ్డి రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టమని, మా ఇంట్లో పెద్దలకు తెలియకుండా కర్నూలు నుంచి రైలులో హైదరాబాద్ కు వెళ్లి క్రికెట్ ఆడి తన స్నేహితులతో తిరిగి వచ్చేవారమణి అన్నారు. క్రికెట్ కు మంచి క్రేజ్ ఉందని, ప్రతిభగల క్రికెటర్లు మంచి ఆదాయం కూడా తీసుకుంటున్నారని, ప్రతి ఒక్కరు ఆటను ఆనందం, ఆరోగ్యం కోసం ఆడాలని బైరెడ్డి కోరారు. ఈ ఆర్ కె రాయలసీమ క్రికెట్ అకాడమి వల్ల ప్రతిభగల క్రీడాకారులు తయారు కావాలని ఆయన పిలుపు నిచ్చారు.



