దుమ్ము,ధూళి,బూడిద కాలుష్యాన్ని నివారించండి
ఏళ్ల తరబడి విద్యానగర్ వాసుల కష్టాలు

దుమ్ము,ధూళి,బూడిద కాలుష్యాన్ని నివారించండి
ఏళ్ల తరబడి విద్యానగర్ వాసుల కష్టాలు
రోగాల బారిన పడుతున్న ప్రజలు
పట్టించుకోని అధికారులు
వెల్దుర్తి అక్టోబర్ 28 యువతరం న్యూస్:
దుమ్ము,ధూళి,బూడిద కాలుష్య కోరల్లో చిక్కుకొని ఏళ్ల తరబడి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని మండల కేంద్రమైన వెల్దుర్తి లోని విద్యానగర్ వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యానగర్ లో బొరుగులు తయారుకు సంబంధించి బియ్యం ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీ నుండి దుమ్ము, ధూళి,బూడిద ఇళ్లలోనికి వస్తుందని దీంతో పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కంటి జబ్బులు, చర్మ వ్యాధులు, అలర్జీ వస్తున్నాయన్నారు.దుమ్ము,ధూళి,బూడిద ఇళ్లలోనికి చేరుతుందని తెలిపారు. దీంతో ఇళ్లలోని వస్తువులన్నీ పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు కల్పించుకొని ఫ్యాక్టరీని అక్కడ నుంచి తొలగించాలని విద్యానగర్ వాసులు కోరుతున్నారు.



