పోలీసు (ఓపెన్ హౌస్) ఆయుధాల ప్రదర్శనను పరిశీలించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్

 
  
  
  
  
 
పోలీసు (ఓపెన్ హౌస్) ఆయుధాల ప్రదర్శనను పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
పోలీసులు వినియోగించే ఆయుధాలు, సాధనాల పట్ల విద్యార్దులు అవగాహన కల్గి ఉండటం మంచిది
కర్నూలు క్రైమ్ అక్టోబర్ 27 యువతరం న్యూస్:
పోలీసులు నిత్యం వినియోగించే ఆయుధాల పై విద్యార్థులకు అవగాహన.
పోలీసు విధుల్లో వినియోగించే ఆయుధాలు, సాధనాల పట్ల విద్యార్థి దశ నుండే అవగాహన కల్గి ఉండటం మంచిదని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ తెలిపారు. పోలీసు అమర వీరుల వారోత్సవాలలో భాగంగా ప్రతీ ఏటా అమరవీరుల పోలీసులను స్మరించుకుంటూ నిర్వహించే ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో ఏర్పాటు చేశారు.
ఈ సంధర్బంగా సోమవారం జిల్లా ఎస్పీ గారు ఒపెన్ హౌస్ కార్యక్రమాన్ని పరిశీలించారు.
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ మాట్లాడుతూ…
ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రజల్లో పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంపొందించడం, పోలీసుల కష్టసాధ్యమైన విధులను వివరించడమే లక్ష్యంగా నిర్వహించామన్నారు.
పోలీసులు తమ నిత్య జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను మరియు వారు ఉపయోగించే ఆయుధాలను నేరుగా చూడగలిగే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు కల్పించామన్నారు.
ప్రతీ విభాగం తీరుపై అవగాహన కలిగించడం ద్వారా విద్యార్థుల్లో సమాజ సేవ పట్ల ఆసక్తి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశామన్నారు.
విద్యార్థులకు ఎఆర్ సిబ్బంది ఆయుధాల వివరాలను తెలియజేస్తున్నారన్నారు.
ఆయుధాల వినియోగ విధానాలు, ఎలాంటి సందర్భంలో ఎలాంటి ఆయుధం వాడవలసి ఉంటుందో, ఆ ఆయుధం ఎలా పనిచేస్తుందో సిబ్బంది తెలియజేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ , ఆర్ ఐలు పోతలరాజు, జావేద్ , నారాయణ, ఆర్ ఎస్ ఐ లు, పోలీసు సిబ్బంది , కర్నూలు నగరంలోని మాంటిస్సోరి స్కూల్ , శ్రీలక్ష్మీ స్కూల్, శ్రీ చైతన్య స్కూల్ విద్యాసంస్థలకు సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారు.
 
				 
					


