KURNOOL BUS ACCIDENT LATEST NEWS:కర్నూలు చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం పై పోలీసుల దర్యాప్తు …


కర్నూలు చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం పై పోలీసుల దర్యాప్తు
కర్నూలు క్రైమ్ అక్టోబర్ 25 యువతరం న్యూస్:
(24.05.2025) శుక్రవారం జరిగిన బస్సు ప్రమాద ఘటన దర్యాప్తులో భాగంగా బైక్ నడుపుతూ చనిపోయినటువంటి శివశంకర్ తో పాటు ఉన్న వెనుకాల కూర్చున్న వ్యక్తి ఎర్రి స్వామి@ నాని గా గుర్తించాము అని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పార్టీలు ఐపీఎస్ తెలిపారు.
పాత్రికేయులతో శనివారం ఆయన మాట్లాడుతూ ఎర్రి స్వామిని మేము పలు కోణాల్లో విచారించాము. ఎర్రిస్వామి మరియు బైక్ నడుపుతున్న శివశంకర్ ఇద్దరు కలిసి లక్ష్మీపురం గ్రామం నుండి అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల కు బయలు దేరారు. ఎర్రిస్వామి ని వదలడానికి తుగ్గలికి బయలు దేరాడు.
ఎర్రిస్వామిని వదలడానికి వెళ్ళిన పల్సర్ బైక్ మార్గం మధ్యంలో కియా షోరూం దగ్గర గల HP PETROL BUNK వద్ద సుమారు అర్ధరాత్రి దాటిన తర్వాత 2.24 గంటలకు రూ. 300 పెట్రోల్ పట్టించుకుని బయలు దేరాడు.
బయలు దేరిన కొద్ది సేపటికి చిన్నటేకూరు సమీపంలో శివశంకర్ బైక్ నడుపుతూ స్క్రిడ్ అయి రోడ్డు కు కుడి ప్రక్కన ఉన్న డివైడర్ ను ఢీ కొట్టాడు .
బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
వెనుకాల ఉన్న ఎర్రిస్వామి @ నాని చిన్న గాయాలతో బయట పడ్డాడు.
ప్రమాద ఘటన స్ధలం దగ్గర రోడ్డు మధ్యలో నుండి శివశంకర్ ను ఎర్రిస్వామి బయటికి లాగి శ్వాస చూడగా చనిపోయాడని అతను నిర్దార్ధించుకునే లోపే రోడ్డు పై పడి ఉన్న బైక్ ను తీద్దామనుకునే సమయంలో అంతలోనే బైక్ ను బస్సు వచ్చి ఢీ కొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్ళింది.
బస్సు క్రింద మంటలు రావడంతో అక్కడి నుండి ఎర్రిస్వామి @ నాని బయపడి తన స్వంత ఊరైనా తుగ్గలి కి బయలు దేరి వెళ్ళిపోయాడు.
ఈ ప్రమాద విషయం పై ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు .
తదుపరి విచారణ దర్యాప్తును కొనసాగిస్తున్నామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ వెల్లడించారు.
 
				 
					


