AP: KURNOOL BUS ACCIDENT:20 మందికి పైగా సజీవ దహనం….????
కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం



20 మందికి పైగా సజీవ దహనం…..???????
కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం
వెల్దుర్తి అక్టోబర్ 23 యువతరం న్యూస్:
కర్నూలు జిల్లా చిన్నటేకూరు ఉలిందకొండ మధ్యన జాతీయ రహదారి 44 పైన శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాదు నుండి దాదాపు 40 మంది ప్రయాణీకులతో బెంగళూరు వెళుతున్న DD 01 N 9490 ప్రైవేట్ ఏసీ బస్సు చిన్నటేగురు విందకొండ మధ్యన శుక్రవారం అర్ధరాత్రి 2.50 గంటల మధ్యన ముందు వెళుతున్న మోటార్ బైకును ప్రైవేట్ బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మోటార్ బైక్ బస్సు కిందికి దూరింది. బస్సు డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే బస్సును నిరుపదలు చేయకుండా ముందుకు వచ్చి బస్సును ఆపి బస్సు కింద ఉన్న బైకును పరిశీలిస్తుండగా బైక్ నుండి పెట్రోల్ లీక్ అయ్యి స్వల్పంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటలను నీటితో ఆర్పేందుకు బస్సు డ్రైవర్ తో పాటు క్లీనర్ ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం. వెంటనే బస్సులో ముందున్న దాదాపు 14 మంది ప్రయాణికులు సురేష్తంగా బయటపడినట్లు తెలిసింది. మిగతా 20 మందికి పైగా ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ వద్దకు వెళ్ళినట్లు తెలిసింది. ఏసీ బస్సు కావడంతో మంటలు ఫలితంగా వ్యాప్తి చెందడం వల్ల సజీవ దహనం అయ్యారు. ప్రమాదం పట్ల డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా ఆగుపడుతున్నట్లు విశ్లేషకులు తెలుపుతున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ విక్రాంత్ పార్టీ ఐపిఎస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, కర్నూలు ఎంపీ నాగరాజు పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కర్నూలు వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. సంఘటన స్థలాన్ని చూసిన ప్రతి ఒక్కరు కన్నీటి పర్యంతమయ్యారు. బస్సు శవాలదిబ్బగా మారిపోయింది.



