రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు మిలిటరీ కాలనీ విద్యార్థులు

రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు మిలిటరీ కాలనీ విద్యార్థులు
కర్నూలు క్రీడలు అక్టోబర్ 25 యువతరం న్యూస్:
స్కూల్ గేమ్స్ ఆధ్వర్యములో డి. ఎస్. ఎ అవుట్డోర్ స్టేడియంలో జరిగిన కర్నూలు ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ 14,అండర్ 17 బాలబాలికల హాకీ సెల్లెక్షన్స్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిలిటరీ కాలనీ విద్యార్థులు మంచి ప్రతిభ కనపరిచి రాష్ట్రస్తాయి హాకీ పోటీలకు ఎంపికయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరమ్మ తెలిపారు పాఠశాల లో అండర్ 17 విభాగంలో విక్షంతిని, స్వర్ణలత బాలుర విభాగం లో చెన్న కేశవ గౌడ్ అలాగే అండర్ 14 విభాగంలో సానియా, క్వీటీ హర్షిణి బాలుర విభాగం లో వంశీ ఎంపిక అయినట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్స్ వెంకటేశ్వర్లు, జోసెఫ్ లక్ష్మయ్య తెలిపారు. వీరు నవంబర్ నెలలో జరిగే రాష్ట్ర స్థాయి హాకీ పోటీలలో పాల్గొంటారు. అని పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు సమీఉల్లా తెలిపారు. కోచ్ ఫార్హన పెద్దయ్య ను ప్రత్యకంగా అభినదించారు.
 
				 
					


