అన్న క్యాంటీన్లను పకడ్బందీగా నిర్వహించాలి
నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్



అన్న క్యాంటీన్లను పకడ్బందీగా నిర్వహించాలి
నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
కర్నూల్ మున్సిపాలిటి అక్టోబర్ 25 యువతరం న్యూస్:
నగరంలోని అన్న క్యాంటీన్లను పకడ్బందీగా నిర్వహించాలని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు. క్యాంటీన్‌లో భోజన నాణ్యత, పరిశుభ్రత, బరువు, తదితర అంశాలను సమీక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. అన్న క్యాంటీన్లపై ఫిర్యాదులను రానియోద్దని, ప్రజలు సంతృప్తి చెందే విధంగా సేవలు అందించాలని సూచించారు. పర్యవేక్షక నోడల్ అధికారులు, నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అనంతరం కమిషనర్ గాయత్రీ ఎస్టేట్ కూడలి వద్ద కుదింపునకు ప్రతిపాదనలు ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. రహదారి విస్తరణ, ట్రాఫిక్ సౌకర్యం, భద్రతా అంశాలపై అధికారులు చర్చించారు. కుదింపు ప్రక్రియలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈ మనోహర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
 
				 
					


