KURNOOL:ఉపాధి కరువై వలస బాట

ఉపాధి కరువై వలస బాట
కోడుమూరు అక్టోబర్ 22 యువతరం న్యూస్.
తగిన ఉపాధి లేక అధిక వర్షాలతో పంటలు సరిగ్గా పండకా రైతులు, రైతు కూలీలు వలస బాట పడుతున్నారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైన కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు ,పత్తికొండ నియోజకవర్గాలలోని చాలా గ్రామాల నుంచి ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. అధిక వర్షాల కారణంతో పంటలు సరిగ్గా పండగ రైతు కూలీలకు స్థానికంగా ఎటువంటి ఉపాధి దొరకక గుంటూరు, కృష్ణ, హైదరాబాద్, నల్గొండ లాంటి పలు ప్రాంతాలకు పొలం పనుల నిమిత్తం కుటుంబ సమేతంగా రైతు కూలీలు వలస వెళ్లాల్సి వస్తుందని పలువురు రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కోసం వెళితే తమ పిల్లల చదువులు కూడా దెబ్బతింటున్నాయని, కాబట్టి స్థానికంగానే ఉపాధి ప్రభుత్వం ఏర్పాటు చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని రైతన్నలు, రైతు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వలసలు అరికట్టడానికి ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక ప్రణాళికలు రచించాలని రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.