ANDHRA PRADESHPROBLEMSTOURISM
ప్రమాదకరంగా బోటులో భక్తుల తరలింపు

ప్రమాదకరంగా బోటులో భక్తుల తరలింపు
కొత్తపల్లి అక్టోబర్ 22 యువతరం న్యూస్ :
తెలంగాణలో సోమశిల నుంచి సంగమేశ్వరానికి భక్తులను ప్రమాదకరంగా కృష్ణానది పై తరలిస్తున్నారు. తుఫాను ప్రభావంతో గాలి తీవ్రతకు అలలు ఎగిసిపడుతున్నా ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు బుధవారం ఓ భక్తుడు బోటు ఎక్కేందుకు వెళుతుండగా అలల తీవ్రతకు బోటు కదిలి బోట్లో కిందపడ్డాడు. సోమశిల బోటు నిర్వహకుడు ఐదు మంది భక్తుల నుంచి సోమశిల నుంచి సంగమేశ్వరానికి చేరవేసేందుకు రూ.3500 వసూలు చేశారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్తిక మాసం ప్రారంభం కావడంతో సంగమేశ్వరానికి భక్తుల తాకిడి పెరిగింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి సంగమేశ్వరున్ని దర్శించుకున్నారు.