ANDHRA PRADESHOFFICIALPROBLEMS
తక్షణ మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు

తక్షణ మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు
వర్షాలతో దెబ్బతిన్న వంకవారిగూడెం కల్వర్టు పరిశీలన
జీలుగుమిల్లి అక్టోబర్ 22 యువతరం న్యూస్:
మండలంలోని వంకవారిగూడెం గ్రామంలో ఉన్న కాలువ కల్వర్టు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతింది. దీనివల్ల గ్రామస్తుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితిని తెలుసుకున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మంగళవారం ప్రత్యక్షంగా గ్రామానికి వెళ్లి కల్వర్టు పరిస్థితిని పరిశీలించారు. గ్రామ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను విన్న ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో చర్చించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యను శీఘ్రంగా పరిష్కరించి ప్రజలకు సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు.